శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 1 జులై 2018 (10:04 IST)

ప్రియుడి ముందే రేప్.. రాత్రంతా నరకయాతన.. మంగళగిరిలో దారుణం

మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రియుడితో కలిసి బయటికి వెళ్లిన ఏ యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజధానికి సమీపంలోని మంగళగిరిలో చోటుచేసుకుంది. ప్రేమ జంటను అడ్డుకున్న దుండగులు

మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రియుడితో కలిసి బయటికి వెళ్లిన ఏ యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాజధానికి సమీపంలోని మంగళగిరిలో చోటుచేసుకుంది. ప్రేమ జంటను అడ్డుకున్న దుండగులు ప్రియుడిని బెదిరించి ప్రియురాలిపై అతడి సమక్షంలోనే దారుణానికి పాల్పడ్డారు. రాత్రంతా యువతిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటనలో బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రియుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. 
 
దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పరారీలో వున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వారికి కఠిన శిక్ష అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.