శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (15:27 IST)

ఏపీలో పెరిగిపోతున్న అకృత్యాలు.. కడపలో వివాహితపై సామూహిక అత్యాచారం

దేశంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నగర శివారుల్లోని ఇందిరానగర్ దగ్గర వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇందిరానగర్‌కు చెందిన ఓ మహిళ కడప రిమ్స్ ఆస్పత్రికి వెళ్ళి తిరిగి వస్తుండగా అటకాయించి కొండల్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. 
 
నలుగురు యువకులు మహిళను దౌర్జన్యంగా లాక్కెళ్ళి ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితులున్నట్లు సమాచారం.  
 
ఇటీవల సంక్రాంతి పండుగ నాడు ఏపీలోని మరో జిల్లాలో దారుణం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న మహిళపై కన్నేసిన యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. రాత్రివేళ లిఫ్ట్ ఇస్తామని బాధితురాలిని నమ్మించిన ఆ దుర్మార్గులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడిన సంగతి తెలిసిందే.