శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (13:48 IST)

రొమ్ము క్యాన్సర్‌కు చెక్ పెట్టే కోడిగుడ్డుతో బోండాలు ఎలా చేయాలంటే?

EGG Bonda
కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా రక్తనాళాలు, గుండె వ్యాధులు దరిచేరవు. కంటి సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. ఇది మెదడు పనితీరుకు, నరాల వ్యవస్థ బలంగా ఉండడానికి దోహదం చేస్తుంది. వారంలో కనీసం ఆరు కోడిగుడ్లు తింటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి కోడిగుడ్లతో వేడి వేడి బోండాలను టేస్ట్ చేద్దాం. 
 
కావలసిన పదార్థాలు 
ఉడికించిన కోడిగుడ్లు- నాలుగు 
బియ్య‌పు పిండి - ముప్పావు కప్పు
ఉప్పు, నూనె - తగినంత 
కారం - అర టీస్పూన్
మిరియాల పొడి - కొద్దిగా
ప‌చ్చిమిర్చి తురుము - ఒక స్పూన్
శ‌న‌గ‌పిండి - ఒక కప్పు
 
తయారీ విధానం:
ఉడికబెట్టిన గుడ్ల‌ను ముక్క‌లుగా చేయాలి. వాటిపై కారం, మిరియాల పొడి, ఉప్పు స‌రిపోయినంత చ‌ల్లుకోవాలి. పాన్ తీసుకుని అందులో నూనె వేసి స‌న్న‌ని మంట‌పై వేడి చేయాలి. ఒక పాత్ర తీసుకుని.. అందులో శెన‌గ‌పిండి, బియ్య‌పు పిండి, కారం, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, ఉప్పు వేసి, నీళ్లు పోసి బొండాల‌కు స‌రిపడేలా పిండిని త‌యారు చేయాలి. పిండి చిక్క‌గా ఉండాలి. 
 
తర్వాత బాణలిలో నూనె వేడయ్యాక ఉడికిన కోడిగుడ్డు ముక్క‌ల‌ను అంత‌కు ముందు రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేయాలి. బంగారు రంగు వ‌చ్చే వ‌ర‌కు ముక్క‌ల‌ను వేయించాలి. దీంతో వేడి వేడి ఎగ్ బోండాలు రెడీ. ఈ ఎగ్ బోండాలను సాస్‌తో సర్వ్ చేస్టే టేస్ట్ అదిరిపోతుంది.