ఆ సమయంలో మహిళలు బెల్లం తీసుకుంటే? (Video)
చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో నొప్పులతో బాధపడుతుంటారు. బెల్లం తినడం వల్ల ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మహిళలు పీరియడ్స్ సమయంలో చాలా వరకు నీరసంగా ఉంటారు. ఈ సమయంలో బెల్లం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూడండి.
* చక్కెర బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
* శరీరంలోని మలినాలను తొలగించి, బెల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* బెల్లం తింటే దగ్గు, జలుబు దూరం అవుతాయి.
* కార్బోహైడ్రేట్స్ కలిగిన బెల్లంతో ఐరన్ సమస్య తగ్గుతుంది, అలాగే రక్తసరఫరా సరిగ్గా జరుగుతుంది.
* ఒక చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
* రుతుక్రమ సమయంసలో వచ్చే నొప్పులను బెల్లం అరికడుతుంది.