కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టి రోగనిరోధక శక్తిని పెంచే ఉల్లికాడలు.. (video)

spring onions
spring onions
సెల్వి| Last Updated: మంగళవారం, 24 నవంబరు 2020 (18:00 IST)
ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ఉల్లికాడలు ఎంతగానో ఉపయోగపడతాయి. కూరల్లో వాటిని వేసుకుని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు. గుండె, రక్తనాళాలకు ఉల్లికాడలు బాగా ఉపయోగపడతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ ఆక్సీకరణను తగ్గిస్తాయి. దీనిలో పుష్కలంగా ఉండే సల్ఫర్‌ కాంపౌండ్‌ బ్లడ్‌ ప్రెజర్‌ స్థాయిలను నియంత్రించడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది.

కళ్ళ జబ్బులు, కాళ్ళ సమస్యలు ఉన్నవాళ్లు ఉల్లికాడలు తినడం మంచిది. దీనిలో ఉండే అల్లసిన్‌ చర్మానికి మంచి చేస్తుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. శరీరంలో గ్లూకోజ్‌ శక్తిని పెంచుతుంది. దీనిలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్‌ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సహకరిస్తుంది. అజీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి అవసరమైన యాంటి బ్యాక్టీరియల్‌ లక్షణాలనూ అందిస్తాయి. ఇది బ్లడ్‌ షుగర్‌ను నియంత్రిస్తుంది.

దీనిలో ఉండే సి విటమిన్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లికాడల్లో ఉండే పెక్టిన్ ముఖ్యంగా పెద్ద పేగు కాన్సర్‌ వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇవి కీళ్ళ నొప్పులు, ఉబ్బసం చికిత్సకు బాగా ఉపయోగపడతాయి.

ఉల్లికాడల్లో ఉన్న క్రోమియం కంటెంట్‌ మధుమేహం నుంచి కాపాడుతుంది. ఉల్లికాడలు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు దీనిలోని స్థూలపోషకాలు జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారంగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
దీనిపై మరింత చదవండి :