ఈ ఆకులతో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? (video)
ప్రకృతి ప్రసాదించిన ఆకు కూరల్లో గోంగూర ఒకటి. అలాంటి గోంగూరను ఇష్టపడనివారుండరు. దీనికి ఆంధ్రామాత అని పేరు కూడా ఉంది. పైగా, ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంలో ముంచి, వెచ్చచేసి వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. అంతేకాకుండా వ్రణాలు, గడ్డల వల్ల కలిగే తీపు తగ్గి, అవి తొందరగా పగులుతాయి. స్వస్థత చిక్కుతుంది. దీనివలన కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
* రక్తపోటును తగ్గిస్తుంది.
* రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది.
* రక్తంలో ఇన్సులిన్ స్థాయి తగ్గించే గుణం ఉంది.
* షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి.
* క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి.
* ఎముకల ఆరోగ్యాన్ని పటిష్టపరుస్తుంది.
* రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
* జీర్ణశక్తి పెరిగి, డైజెస్టిస్ సమస్యలు దూరమవుతాయి.
* కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది.
* రేచీకటిని కూడా తగ్గిస్తుంది.
* మంచి నిద్రపడుతుంది.
* మహిళలకు రుతుక్రమ సమయంలో తగ్గిన శక్తి వస్తుంది.
* దగ్గు, ఆయాసం, తుమ్ములని తగ్గిస్తుంది.
* అధిక బరువును తగ్గిస్తుంది.
* కిడ్నీ వ్యాధులను నివారిస్తుంది.