ఇవి మహిళలు ఆచరించదగ్గ ఆరోగ్య నియమాలు... (Video)
రోజూ తినే ఆహారంలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ఇది కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో పుష్కలంగా ఉంది.
బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాలా ఉపయోగపడతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును తొలగిస్తుంది. కూరల్లో కలిపి తిన్నా, రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకుని తాగినా చక్కని ఫలితాలు వస్తాయి.
వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా కరిగిస్తాయి. అందుకే వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది.
వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. ఇతర నూనెలతో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని తినే వారిలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూరలు తింటేనే మేలు.