1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2015 (11:38 IST)

బీభత్సం సృష్టించిన అంబులెన్స్: మహిళ మృతి, పరిస్థితి విషమం

నెల్లూరులో అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ మృత్యుశకటంగా మారింది. రహదారి పక్కన నిలబడి వున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇకపోతే.. ఏవైనా ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్సను అందించి, సమయానికి ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే అంబులెన్సులే ఇలా ప్రమాదాలకు కారణం అవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నెల్లూరులోని ఇరగాళ్లమ్మ ఆలయం సమీపంలో జరిగింది.