గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: సోమవారం, 6 ఆగస్టు 2018 (22:12 IST)

విశాఖ‌లో సెల్ ట‌వ‌ర్ ఎక్కి క‌ల‌క‌లం సృష్టించిన మ‌హిళ‌..!

విశాఖ కలెక్టరేట్ వద్ద ల‌క్ష్మి అనే మహిళ సెల్ టవర్ ఎక్కి కలకలం రేపింది. దీంతో అధికారులు, పోలీసులు ఉరుకులూ పరుగులు పెట్టారు. మల్కాపురం ప్రాంతానికి చెందిన లక్ష్మి భర్త కొన్నేళ్ల కిందట మరణించాడు. అప్ప‌టి నుంచి ఇద్దరు కూతుళ్లను తానే పెంచి పోషిస్తోంది. తనక

విశాఖ కలెక్టరేట్ వద్ద ల‌క్ష్మి అనే మహిళ సెల్ టవర్ ఎక్కి కలకలం రేపింది. దీంతో అధికారులు, పోలీసులు ఉరుకులూ పరుగులు పెట్టారు. మల్కాపురం ప్రాంతానికి చెందిన లక్ష్మి భర్త కొన్నేళ్ల కిందట మరణించాడు. అప్ప‌టి నుంచి ఇద్దరు కూతుళ్లను తానే పెంచి పోషిస్తోంది. తనకు చెందిన స్థలాన్ని ఓ రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఆక్రమించారని ఆమె ఆరోపిస్తోంది. అతడి పై చర్యలు తీసుకొమ్మంటూ అధికారులకు ఫిర్యాదు చేయగా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. 
 
తనకు పిల్లల పోషణ భారమైందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లభించడంలేదని... అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగానని, అయినా తనకు న్యాయం జరగడంలేదని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. చివరికి కలెక్టరేట్‌ను ఆశ్రయిస్తే.. కలెక్టర్‌ను కలవనీయకుండా అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పింది. తనకు న్యాయం చేయకపోతే అక్కడ నుంచి దూకేస్తానని బెదిరించింది. పోలీసులు ఆమెను సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. అనంతరం ప్రభుత్వ పరంగా సాయం చేస్తామని, భూ ఆక్రమణ విషయమై దర్యాప్తు చేయిస్తామని కలెక్టర్ ఆమెకు హామీ ఇచ్చారు. అదీ సంగ‌తి..!