శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Kowsalya
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (14:07 IST)

కొత్త ఫ్యాషన్... జాకెట్‌తో వడ్డాణాలు...

చీర కట్టుకుని నడుముకు వడ్డాణాలు పెట్టుకోవడమనేది పాత పద్ధతి. కానీ ఇప్పటి ఫ్యాషన్ జాకెట్‌నే వడ్డాణాలుగా చుట్టేసుకుంటున్నారు. రవికను ముడి వేసినట్లుగా బెల్ట్‌తో పవిటను కట్టేస్తే ఆ బెల్ట్‌కి ఎంబ్రాయిడరీ సొ

చీర కట్టుకుని నడుముకు వడ్డాణాలు పెట్టుకోవడమనేది పాత పద్ధతి. కానీ ఇప్పటి ఫ్యాషన్ జాకెట్‌నే వడ్డాణాలుగా చుట్టేసుకుంటున్నారు. రవికను ముడి వేసినట్లుగా బెల్ట్‌తో పవిటను కట్టేస్తే ఆ బెల్ట్‌కి ఎంబ్రాయిడరీ సొబగులు అద్దితే అది చాలా అందమైన బెల్ట్ బ్లౌజ్‌గా తయారవుతుంది.
 
స్టైలిష్ లుక్ కోసం చీట పైట చెంగుకు 8-10 ఫ్రిల్స్ పెట్టుకుని భుజం మీదుగా జాకెట్‌కు పిన్‌తో జతచేయాలి. అదే జాకెట్ బెల్ట్ పెట్టేసుకుంటే బాగుంటుంది. ఎలా సెట్ చేసిన ఫ్రిల్స్ అలాగే ఉంటాయి. అంతేకాకుండా సౌకర్యంగా కూడా ఉంటుంది. లుక్స్‌లో వచ్చిన స్టైలిష్ మార్పుకు వేడుకులలో ఎక్కడున్నా బ్రైట్‌గా వెలిగిపోతారు. 
 
జాకెట్ మాత్రమే కాదు బెల్ట్‌కు కూడా ఎంబ్రాయిడరీ చేసి పైట కొంగుమీదుగా తొడిగేస్తే అందంగా ఉంటుంది. అంతే అలంకరణ పూర్తయినట్లుగా ఉంటుంది. ట్రెండ్‌లో ఉన్నారన్న కితాబులూ మీ సొంతమవుతాయి.