శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Kowsalya
Last Updated : శనివారం, 21 జులై 2018 (09:36 IST)

బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి బ్యాగులు ఎంచుకోవాలంటే?

ఏదో ఒకటని కాకుండా హ్యాండ్‌బ్యాగ్ ఎంచుకునేప్పుడు కంటికింపుగానే కాదు సౌకర్యంగాను ఉండాలి. అది మీకో ప్రత్యేకతను తెచ్చిపెట్టాలి. మరి అందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మీరు ఓ బ్యాగు కొనాలన

ఏదో ఒకటని కాకుండా హ్యాండ్‌బ్యాగ్ ఎంచుకునేప్పుడు కంటికింపుగానే కాదు సౌకర్యంగాను ఉండాలి. అది మీకో ప్రత్యేకతను తెచ్చిపెట్టాలి. మరి అందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మీరు ఓ బ్యాగు కొనాలనుకున్నప్పుడు మీ శరీరాకృతికి కాస్త భిన్నమైనదాన్ని ఎంచుకోవాలి. అప్పుడే కొత్తగా కనిపిస్తారు. 
 
ఉదాహరణకు మీరు సన్నగా పొడవుగా ఉంటే మీరు బ్యాగు చిన్నగా ఉండాలి. ఇలాంటివారు సాయంత్రపు పార్టీలకు క్లచ్ పర్స్‌ని ఎంచుకుంటే ఆ అందమే వేరు. ఎత్తు తక్కువగా ఉన్నవారికి మరీ పెద్దవి అంటే ఓవర్‌సైజ్డ్ బ్యాగులు బాగుండవు. ఇవి మిమ్మల్ని మరింత లావుగా కనిపించేలా చేస్తాయి. అలాగే పొడుగ్గా వేలాడేవీ ఎంచుకోకూడదు.
 
బ్యాక్‌ప్యాక్‌లు మీ శరీరాకృతిని కనిపించకుండా చేస్తాయి. అలాని మరీ చిన్న బ్యాగులని ఎంచుకోవద్దు. వీలైతే ప్రింట్స్, చిన్న చిన్న డిజౌన్స్ ఉన్నవి ఎంచుకోవచ్చు. కేవలం శరీరాకృతే కాదు సందర్భాన్ని బట్టి వాటిని వాడాల్సి ఉంటుంది. దుస్తులకు తగినట్లుగా మెరుపులున్నవి వాడొచ్చు. స్నేహితులతో వెళ్తుంటే స్లింగ్ షోల్డర్ తరహా బ్యాగుల్ని వేసుకోవచ్చు.