శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 30 మే 2018 (20:38 IST)

మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్య

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. ఎస్‌బిఐ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనం పైన వెళుతున్న న్యాయవాది నాగజ్యోతిపై కత్తులతో దాడికి దిగారు గుర్తు తెలియని వ్యక్తులు.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. ఎస్‌బిఐ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనం పైన వెళుతున్న న్యాయవాది నాగజ్యోతిపై కత్తులతో దాడికి దిగారు గుర్తు తెలియని వ్యక్తులు. 
 
ఆ దాడిలో సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు నాగజ్యోతి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దాడికి తెగబడ్డ దుండగులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మృతురాలు ప్రముఖ న్యాయవాది జితేంద్ర సతీమణి. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.