మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (15:10 IST)

యాదాద్రిలో వ్యభిచార కూపం.. అమ్మాయిలను కిడ్నాప్ చేసి?

యాదాద్రి పోలీస్‌ స్టేషన్‌ వద్ద తల్లిదండ్రుల రోదన వినిపించింది. అక్కడ వ్యభిచార నిర్వాహకుల చెర నుంచి బయటపడిన 15 మంది బాలికల్లో తమ కూతురు ఉంటుందేమోనని కొందరు తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. ఫొటోలను చూసి

యాదాద్రి పోలీస్‌ స్టేషన్‌ వద్ద తల్లిదండ్రుల రోదన వినిపించింది. అక్కడ వ్యభిచార నిర్వాహకుల చెర నుంచి బయటపడిన 15మంది బాలికల్లో తమ కూతురు ఉంటుందేమోనని కొందరు తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. ఫొటోలను చూసి ఇద్దరు బాలికలను గుర్తించిన తల్లిదండ్రుల ఆవేదన చెందారు.


తమ బిడ్డలు ఇన్నాళ్లు వ్యభిచార కూపంలో మగ్గారని తెలుసుకొని గుండెలవిసేలా రోదించారు. తమ బిడ్డలను చూపెట్టాలంటూ పోలీసులను ప్రాధేయపడ్డారు. ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత పిల్లలను అప్పగిస్తామని పోలీసులు వారికి చెప్పారు. 
 
వ్యభిచార గృహాల నిర్వాహకుల నుంచి 15మంది బాలికలకు విముక్తి కల్పించిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. యాదాద్రి పట్టణంలోని కల్యాణి అనే మహిళ ఇంట ఈ దందా జరుగుతోంది.

ఆ ఇంట ఆడ పిల్లల ఏడుపు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ ఇంట సోదాలు నిర్వహించి.. కల్యాణిని గట్టిగా నిలదీసేసరికి నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఇలా కల్యాణి చెర నుంచి పోలీసులు 15మంది బాలికలను రక్షించారు. ఈ కేసులో ఇప్పటివరకు 11మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురు నిర్వాహకులు పరారీలో ఉన్నారు. మరోవైపు హార్మోన్ల వృద్ధి కోసం బాలికలకు ఇంజెక్షన్లు చేస్తున్నట్టుగా తేలడంతో యాదాద్రిలోని అనురాధ నర్సింగ్‌ హోంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సాంబశివరావు సీజ్‌ చేశారు.