1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (21:28 IST)

హీటెక్కుతున్న గన్నవరం రాజకీయం.. వైసీపీ నేతల మధ్య వార్

ysrcp flag
అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్న అధికార వైసీపీ పార్టీలో గన్నవరం రాజకీయం ఎప్పటికప్పుడు హీట్ లోనే ఉంటుంది. ఏపీ పాలిటిక్స్‌లో అంత్యం వివాదాస్పదమైన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరమే. 
 
ఇప్పటికే గన్నవరంలో వల్లభనేని వంశీ, దుట్టా రామచందర్రావు, యార్లగడ్డకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. సీఎం జగన్, సజ్జలతో సహా పార్టీలోని పెద్దలంతా ఈ వివాదాన్ని క్లోజ్ చేయాలనుకున్నా ఏమాత్రం కుదరటంలేదు. 
 
సీఎం జగన్ కూడా వీరి పంచాయితీపై అసహనం వ్యక్తం చేసినా అది మాత్రం అంతకంతకు పెరుగుతునే ఉంది. అసలే వివాదాలుగా ఉన్న గన్నవరం రాజకీయానికి మాజీ మంత్రి కొడాలి నాని మరికాస్త ఆజ్యం పోశారు. దీంతో గన్నవరం రాజకీయం మరోసారి హీటెక్కింది.
 
2024లో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఇందులో మరోమాట లేదన్నారయన.
 
అంతేకాదు కొంతమంది నేతలు పెనమలూరు టీడీపీ టికెట్ కోసం వెళ్తే.. గన్నవరం, గుడివాడకు వెళ్తారా అని అడగాల్సిన దుస్థితి నెలకొంది అని అన్నారు. 
 
రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొందన్నారు. గన్నవరం, గుడివాడలో తమను ఓడించే నాయకులు టీడీపీకి లేరని కొడాలి నాని ఎద్దేవా చేశారు.