శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (15:31 IST)

మంగళగిరిలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు

ysrcp plenary
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు మంగళగిరిలో జరుగనున్నాయి. జులై 8,9వ తేదీన పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్నారు. 
 
ఈ సందర్భంగా మంగళగిరిలో వైసీపీ నాయకులు, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ప్లీనరీ విశేషాలను వెల్లడించారు. 
 
2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175కు స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు మంగళగిరిలో వైసీపీ నాయకులు, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ప్లీనరీ విశేషాలను వెల్లడించారు. 
 
ఐదు సంవత్సరాల క్రితం మంగళగిరిలో ప్లీనరీ సమావేశాలు జరుపుకున్నామని తెలిపారు. 2027లో మరోసారి ప్లీనరీ నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.