శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (11:56 IST)

రాజమండ్రి కోర్టుకు అనంతబాబు

murder
మాజీ డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. ఆయనకు కోర్టు విధించిన రిమాండ్ గడువు ఈ రోజుతో ముగుస్తోంది. 
 
దీంతో, ఈరోజు ఆయనను రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోలీసులు హాజరు పరుచనున్నారు. ఈరోజు జరిగే విచారణలో కోర్టు ఆయన రిమాండ్ ను పొడిగిస్తుందా? లేక బెయిల్ ఇస్తుందా? అనే విషయం తేలనుంది. 
 
ఇక సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై తొలి నుంచి మృతుడి కుటుంబసభ్యులు, దళిత సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 
 
తాజాగా ఈ కేసులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.