గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (22:30 IST)

సీఎం జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

jagan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి యూరప్ టూర్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యూరప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది. తన వ్యక్తిగత పర్యటనకు అనుమతించాలంటూ సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్ళరాదన్న బెయిల్ షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు.
 
ఈ పిటిషన్‌పై సీబీఐ ఈ నెల 17వ తేదీన కౌంటర్ దాఖలు చేయగా మంగళవారం కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకు జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు పచ్చజెండా ఊపింది. అయితే, పర్యటనకు ముందు జగన్తన మొబైల్ ఫోన్, ఈ మెయిల్ ఐడీ, పర్యటన వివరాలు కోర్టుకు, సీబీఐ ఇవ్వాలని ఆదేశించింది.