1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మార్చి 2024 (17:00 IST)

మంగళగిరి ఇన్చార్జింగా లావణ్య.. నెల్లూరు లోక్‌సభకు విజయసాయి రెడ్డి

vijayasai reddy
ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల కోసం ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. ఇందులోభాగంగా, కొందరు అభ్యర్థుల పేర్లతో తొమ్మిదో జాబితాను సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి రిలీజ్ చేశారు. ముఖ్యంగా, మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి మురుగుడు హానుమంతరావు కోడలు, మురుగుడు లావణ్యను ఎంపిక చేశారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె. 
 
ఇకపోతే, నెల్లూరు లోక్‌సభ స్థానానికి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేరును ప్రకటించారు. నెల్లూరు లోక్‌సభ స్థానంల బలమైన అభ్యర్థి కోసం చూస్తున్న వైకాపా చిరవకు విజయసాయి రెడ్డికి అవకాశం కల్పించింది. కర్నూలు వైకాపా ఇన్‌చార్జిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ పేరును ప్రటించారు. అదేవిధంగా కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు ఈ సారి అవకాశం నిరాకరించింది జగన్మోహన్ రెడ్డి... ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన ఇంతియాజ్‌ను కర్నూలు ఇన్‌చార్జ్‌గా నియమించడం గమనార్హం. 
 
కాగా, విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తన్న వైకాపా తాజాగా విడుదల చేసిన జాబితాలో కేవలం ముగ్గురు పేర్లు మాత్రమే ఉండటం గమనార్హం. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పోటీగా గతంలో గంజి చిరంజీవిగా ఇన్చార్జిగా ప్రకటించింది. అయితే, అతన్ని తొలగించి మురుగుడు లావణ్య పేరును ప్రకటించడం గమనార్హం. 
 
ఈ నెల 10న వైకాపా మేనిఫెస్టో రిలీజ్ 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార వైకాపా త్వరోలనే మేనిఫెస్టోను రిలీజ్ చేయనంది. ఇందుకోసం ఈ నెల 10వ తేదీని ముహూర్తం ఖరారు చేసింది. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో నిర్వహించ తలపెట్టిన నాలుగో 'సిద్ధం' మహాసభ వేదికగా సీఎం జగన్ ప్రకటించనున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. 100 ఎకరాల విస్తీర్ణంలో 15 లక్షల మందితో ఈ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. పలువురు మంత్రులు, కీలక నేతలతో కలిసి 'సిద్ధం' సభ సన్నాహకాలను శనివారం పరిశీలించారు.
 
ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ వివరాలను విజయసాయి రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా 'సిద్ధం' మహాసభ ప్రచార' గీతాన్ని, గోడపత్రాలను ఆవిష్కరించారు. మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేరుగు నాగార్జున, కాకాణి గోవర్ధన్రెడ్డి, అంబటి రాంబాబు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆదాల ప్రభాకర్రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నాలుగు ఉమ్మడి జిల్లాల అధికారపార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
కాగా, సార్వత్రిక ఎన్నికలతో పటు అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 13 లేదా 14వ తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని విజయసాయి రెడ్డి అన్నారు. 'సిద్ధం' సభ తర్వాత సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు. 10న నిర్వహించనున్న సిద్ధం సభకు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తామన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్న కార్యక్రమాలను పరిశీలించి భవిష్యత్తులో పేదలకు మరిన్ని మెరుగైన పథకాలను మ్యానిఫెస్టోలో చేర్చుతామని చెప్పారు.