శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఫిబ్రవరి 2024 (11:55 IST)

రిలయన్స్‌తో చేతులు కలిపిన డిస్నీ

Disney
ప్రపంచ ప్రసిద్ధి చెందిన వాల్ట్ డిస్నీ సంస్థ తన భారతీయ ప్రసారాలు, ఓటీటీ తదితర సేవలకు సంబంధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో చేతులు కలిపింది. భారతదేశంతోపాటు ప్రపంచం మొత్తం వ్యాపారంలో అగ్రగామిగా నిలిచిన ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో డీల్ కుదుర్చుకోవడంపై హర్షం వ్యక్తం చేసింది. 
 
ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ క్లయింటింగ్ సంస్థ వయాకామ్ 18 ఇండియా మొత్తం వార్తా ఛానెల్‌లు, ఎండెర్టీయింట్‌మెంట్, స్పోర్ట్స్ ఛానల్స్ అందిస్తోంది.
 
ప్రస్తుతం భారత మార్కెట్లో తమ సేవలను అప్‌డేట్ చేయడం కోసం వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను రిలయన్స్‌లతో వాల్ట్ డిస్నీ కలుపుతుంది. 
 
ఈ ఒప్పందం ఆధారంగా రిలయన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం రూ.11,500 కోట్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది.
 
ప్రస్తుతం డిస్నీ + ఒడిటి హాట్‌స్టార్‌లతో కలిసి భారతదేశంలో ఓటీటీ సేవలను అందిస్తున్నారు. వచ్చే రోజుల్లో జియో సినిమాతో డిస్నీ ప్లస్ కార్యక్రమాలు అందజేయబడతాయి.