శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (07:15 IST)

తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిన గడపగడపపై నివేదిక - రేపు సమీక్ష

ys jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు వైకాపా ప్రభుత్వం అనే పేరుతో చేపట్టిన కార్యక్రమాని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించేందుకు వెళ్లిన వైకాపా ప్రజాప్రతినిధులకు ప్రజలు చుక్కలు చూపించారు. గడప గడపలోనూ ప్రజలు నిలదీశారు. 
 
ఈ విషయం ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి చేరడంతో ఆయన ప్రత్యేకంగా దృష్టిసారించి ఓ నివేదిక తయారు చేయించుకున్నారు. ఆ నివేదిక ఇపుడు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. దీనిపై బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో పలు కీలక అంశాలు చర్చకురానున్నట్టు సమాచారం. 
 
బుధవార ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి ప్యాలెస్‌లోని కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. 
 
ఇందులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురైన అనుభవాలను స్వయంగా సీఎం పార్టీ ఇన్‌ఛార్జుల నుంచే తెలుసుకోనున్నారు. పార్టీలు చెప్పిన దానిని తనకు అందించిన నివేదికతో పోల్చి చూసి ఆ తర్వాత తదుపరి కార్యాచరణను ప్రారంభించే అవకాశం ఉంది.