యాక్షన్ డ్రామాతో యువత ఆలోచించేలా చేసే కమల్‌హాసన్ విక్రమ్ - రివ్యూ రిపోర్ట్
నటీనటులు: కమల్ హాసన్-విజయ్ సేతుపతి-ఫాహద్ ఫాజిల్- సూర్య (క్యామియో)-నరేన్- కాళిదాస్ జయరాం-చెంబన్ వినోద్ జోస్-స్వస్తిక తదితరులు
సాంకేతికత- ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాతలు: కమల్ హాసన్-మహేంద్రన్, రచన-దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
కమల్ హాసన్ దాదాపు నాలుగేళ్ళ తర్వాత వచ్చిన చిత్రం విక్రమ్. తమిళంలో తీసిన ఈ చిత్రం తెలుగులో నేడే విడుదలైంది. కార్తీతో ఖైదీ తీసిన లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడం ఒక విశేషం. విజయ్ సేతుపతి.. ఫాహద్ ఫాజిల్ తోపాటు సూర్య కూడా ఇందులో నటించాడనే అంశంతో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. దాదాపు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ హిందీలోకూడా విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
పోలీస్ ఆఫీసర్ ప్రభంజన్ (కాళిదాస్ జయరాం). చెన్నై కేంద్రంగా సాగే కొకైన్ మాదకద్రవ్యాన్ని రెండు టన్నులు పట్టుకుని దాచేస్తాడు. అది రోలెక్స్ అనే మాదకద్రవ్యవాల బాస్ రోలెక్స్ (సూర్య) నుంచి సంతానం (విజయ్ సేతుపతి)కి వస్తుంది. దీన్ని తనకు దక్కకుండా చేసిన ప్రభంజన్‌ను సంతానం చంపేస్తాడు. ప్రభంజన్, కర్ణన్ (కమల్ హాసన్)కొడుకు. దాంతో కొడుకు చనిపోయాడు. అప్పుడే పుట్టిన మనవడు విక్రమ్‌ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. తన కొడుకును చంపినవారిని వెతికి మరీ చంపడానికి నలుగురే గేంగ్‌తో కర్ణన్ ప్రయత్నిస్తాడు. ఇంకోవైపు సంతానం గ్యాంగ్, పోలీసు బ్యాచ్ కుం చెందిన అమర్ (ఫయాస్) కూడా చాచేసిన కొకైన్ కోసం వెతుకుతూంటారు. ఆ వెతుకులాటలో అమర్‌కు కర్ణన్ గురించి సీక్రెట్ తెలుస్తుంది. ఆ తర్వాత అతను ఏంచేశాడు? మిగిలినవారు పయనం ఎటువైపుకు దారితీసింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
కమల్ హాసన్ సినిమాలంటే ఏదో ఒక ఆలోచన, కొత్తదనం క్రియేట్ చేస్తుంటాడు. కొన్ని సార్లు అవి సామాన్యులకు అర్థంకావు. మెచ్చూర్డ్‌గా వుంటాయి. ఇది కూడా అలాంటిదే. కొకైన్ అనే మాదకద్రవ్యంపై చాలా సినిమాలు వచ్చాయి. సిండికేట్ ముఠాను పట్టుకుకోవడం. అందులో కొంతభాగాన్ని అధికారులు నొక్కేసి కాష్ చేసుకోవడం. ఈ రకంగా కథలు వున్నాయి. కానీ విక్రమ్‌లో కమల్‌హాసన్ చెప్పిన పాయింట్ ఆలోచించేదిగా వుంది. కొకైన్‌ను కొంచెమే కదా అని పుచ్చుకుంటే మనిషిని ఎంతమేరకు దిగజారుస్తుందో వివరిస్తాడు. దేశంలో కొకైన్ ఎక్కైపోయి మనిషి మనుగడ నశించిపోతుంది. కోతిలా బిహేవ్ చేస్తాడు. వావివరుసలు మర్చిపోతాడు. అందుకే దీన్ని అంతం చేయాలనేది డైలాగ్ రూపంలో వివరిస్తాడు.
ఇక మిగిలిన కథంతా లోకేస్ గత చిత్రం ఖైదీతరహాలో గేంగ్ ముఠా, రాత్రి పూట యాక్షన్ సన్నివేశాలు కాల్పులు, కత్తులతో దాడి ఇవన్నీ వున్నాయి. విజయ్ సేతుపతి నడక మేనరిజం కొత్తగా అనిపించి ఆకట్టుకుంటంది. పోలీసు అధికారిగా ఫాహద్ ఫాజిల్ లను కూడా సరిగ్గా వాడుకుని విక్రమ్‌ను జనరంజకంగా మలిచాడు దర్శకుడు. కమ ల్‌గురించి చెప్పాల్సిన పనిలేదు. తన పాత్ర మేరకు తను బాగా చేశాడు. గుండె వీక్‌గా వున్న తన మనవడి గురించి కమల్ పడే తపన, ఆరాటం చక్కగా నటనలో ఆవిష్కరించాడు. అయితే మొదటి భాగమంతా ఫాజిల్ హీరోగా సాగుతుంది. అక్కడక్కడా కమల్ కనిపిస్తాడు. సెకండాఫ్‌లోనూ అంతే. కానీ ప్రతి సన్నివేశం కమల్ పాత్రతోనే ముడిపడివుంటుంది. సీనియర్ నటుడిగా తెరపై తాను ఎక్కువ కనిపించకుండా ఇతరనటులతో డీల్ చేయడం విశేషం.
ఫైనల్‌గా సూర్య పాత్ర కనిపించి విక్రమ్‌కు సీక్వెల్ కూడా తీయవచ్చు అనే హింట్ కూడా వదిలాడు.
ప్లస్ పాయింట్లు-
నటీనటుల పెర్ఫార్మెన్స్, కథలోని సందేశం, అనిరుద్ నేపథ్య సంగీతం, సినిమాటోగ్రపీ
మైనస్- రెండు సినిమాలు చూసిన ఫీలింగ్, ఫస్టాఫ్ ఎక్కువ కావడం, యాక్షన్ మోతతో ఘోరెత్తించడం