మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (16:23 IST)

థ్రిల్ల‌ర్ అంశాల‌తో సందేశాత్మ‌క చిత్రం శేఖ‌ర్ - రివ్యూ రిపోర్ట్‌

Rajasekhar, shivani
Rajasekhar, shivani
నటీనటులు: రాజశేఖర్-ముస్కాన్-ఆత్మిక రాజన్-శివాని రాజశేఖర్-అభినవ్ గోమఠం-సమీర్-పోసాని కృష్ణమురళి-కిషోర్ తదితరులు
సాంకేతిక‌త‌- ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నారగాని, సంగీతం: అనూప్ రూబెన్స్, కథ: షాహి కబీర్,  మాటలు: లక్ష్మీ భూపాల్,  నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి-శివాని రాజశేఖర్-శివాత్మిక రాజశేఖర్-బొగ్గారం వెంకట శ్రీనివాస్స్క్రీ న్ ప్లే-దర్శకత్వం: జీవిత రాజశేఖర్
 
హీరో రాజశేఖర్ తాజాగా చేసిన సినిమా `శేఖ‌ర్‌`. మలయాళ  `జోసెఫ్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆయ‌న‌కు బాగా న‌చ్చి చేశాడు. ‘గరుడవేగ’, క‌ల్కి చిత్రాల‌లో ఎన‌ర్జిటిక్‌గా క‌నిపించిన రాజ‌శేఖ‌ర్ శేఖ‌ర్ సినిమాలో చాలా కూల్‌గా వ‌య‌స్సుపై బ‌డిన పాత్ర‌లో క‌నిపించాడు. ఈరోజే విడుద‌లైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
 
శేఖర్ (రాజశేఖర్) అర‌కులో కానిస్టేబుల్‌. భార్య అపార్థంతో దూర‌మ‌వుతుంది. మ‌రొక‌రిని పెండ్లి చేసుకుంటుంది. ఒక్క కూతురుని పెంచుకుంటున్న ఆయ‌న‌కు అనుకోనివిధంగా రోడ్డుప్ర‌మాదంలో కూతురు శివానీ చ‌నిపోతుంది. దాంతో ఒంట‌రిత‌నాన్ని అనుభ‌విస్తూ తాగుడుకు బానిస‌గా మారిపోతాడు. తోటి కానిస్టేబుల్లు స‌మీర్‌, గోమ‌టం, భ‌ర‌ణి అప్పుడ‌ప్పుడు వ‌చ్చి క‌లుస్తుంటారు. ఓరోజు మాజీ భార్య‌కూడా రోడ్డు ప్ర‌మాదంతో మ‌ర‌ణిస్తుంది. ఏదో వాహ‌నం వెన‌క‌నుంచి వ‌చ్చి గుద్దింది అని పోలీసులు కేసు రాసి ముగించేద్దామ‌నుకున్న త‌రుణంలో కొన్ని సంఘ‌ట‌న‌లు శేఖ‌ర్‌కు అనుమానాన్ని క‌లిగిస్తాయి. ఆ కోణంలో ప‌రిశోధిస్తే త‌న కూతురు ప్ర‌మాదం కూడా అలానే జ‌రిగింద‌ని గ్ర‌హిస్తాడు. ఆ త‌ర్వాత శేఖ‌ర్ ఏం చేశాడు? అత‌ని అనుమానం నిజ‌మేనా? ఇందులో ఏదో మిస్ట‌రీ వుంద‌ని శోధించిన శేఖ‌ర్ ఏమ‌య్యాడు? అనేది మిగిలిన సినిమా. 
 
విశ్లేషణ:
 
డా. రాజ‌శేఖ‌ర్ చాలా సినిమాలు రీమేక్ చేసిన‌వే. అందులో భాగంగానే జోసెఫ్‌ను శేఖ‌ర్‌గా తీశారు. మ‌ల‌యాళం రీమేక్‌లంటే అక్క‌డ ఎడ్య‌కేటెడ్ ప్రేక్ష‌కులు ఎక్కువ‌. క‌థ‌నం నిదానంగా సాగుతూ ఓ చ‌క్క‌టి అంశం చివ‌ర్లో క‌నిపిస్తుంది. మాన‌వీయ విలువ‌లు, సామాజిక ఇతివృత్తాలు క‌నిపిస్తాయి. శేఖ‌ర్‌లోనూ అదే వుంది. సాధార‌ణ పోలీస్ కానిస్టేబుల్‌, స్పుర‌ద్రూపి అయిన శేఖ‌ర్ త‌న జీవితంలో చోటుచేకున్న ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో జీవితాన్నే త్యాగం చేసిన వ్య‌క్తి క‌థ‌. 
 
ప్ర‌స్తుతం కార్పొరేట్ ఆసుప‌త్రుల‌లో జ‌రుగుతున్న బ్రెయిన్ డెడ్ మ‌నిషి అవ‌య‌వాల‌ను ఏవిధంగా ప్ర‌భుత్వం ప‌థ‌కాల‌తో పేరుతో మిస్ యూజ్ చేస్తున్నార‌నే పాయింట్‌ను హైలైట్ చేశాడు. గ‌తంలో ఈ త‌ర‌హా క‌థ‌లు వ‌చ్చినా ఒక్కో నేప‌థ్యం వుండేది. ఏజెంట్ ఆత్రేయ సాయిశ్రీ‌నివాస్ అనే చిత్రంలోకూడా మారుమూల ప్రాంతాల్లో వుండే కొంద‌రిని ఏవిధంగా ఓ మాఫియా వారి జీవితాల‌ను కేష్ చేసుకుంటుందో చూశాం. ఇప్పుడు శేఖ‌ర్ సినిమాలోకూడా మారుమూల ప్రాంతాల‌లో కొంద‌రిని టార్గెట్ చేస్తూ వారి అవ‌య‌వాల‌తో కోట్లు సంపాదిస్తున్నార‌నేది పాయింట్‌. దీనిని అరిక‌ట్టాలంటే కోర్టులు కొత్త రూల్స్ తీసుకురావాలి. అధికారులు క్రాస్ చెక్ చేయాల‌నేది మెసేజ్ ఇందులో ఇచ్చాడు. 
 
 కథ పరంగా కొత్తదనం ఉన్నా.. ఆసక్తికర మలుపులకు చోటున్నా.. ఇక్కడి ప్రేక్షకులు కోరుకునే స్థాయిలో కథనంలో వేగం లేకపోవడం.. ఫ్యామిలీ డ్రామా మరీ నీరసం తెప్పించేయడం ఈ చిత్రానికి ప్రతికూలంగా మారాయి.  . ‘శేఖర్’  ప్రేక్షకులు ఆసక్తిగా కథలో ఇన్వాల్వ్ అయ్యేలా మాత్రం చేయలేకపోయింది.   హీరో ఫ్లాష్ బ్యాక్.. అతడి కుటుంబంలో సమస్యలు.. ఇవే ప్రథమార్ధంలో ఎక్కువ టైం తినేశాయి. యువకుడిగా రాజశేఖర్ గెటప్.. మేకప్ బాగానే చూపించారు. ఓ  హత్య కేసు  ఛేదించడంలో హీరో నైపుణ్యాన్ని చూపించే ఇంట్రో సీన్ ఆసక్తికరంగా అనిపించినా.. ఆ తర్వాత వెంటనే ఈ ఫ్లాష్ బ్యాక్.. ఫ్యామిలీ ఎమోషన్ల మీదికి కథను మళ్లించడంతో ‘శేఖర్’ ఇంటర్వెల్ వరకు భారంగా గడుస్తుంది.
 
 ఇప్ప‌టి. థ్రిల్లర్ సినిమాలకు ఉండాల్సిన ప్రధానమైన స్పీడ్‌ లక్షణాలు కొరవడడం వల్ల ఉత్కంఠ పంచలేకపోయింది. కానీ చివర్లో వచ్చే ట్విస్ట్.. ఈ మాఫియా ఎలా నడుస్తోందో చూపించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విలన్ల నెట్ వర్క్ గురించి.. వాళ్ల నేపథ్యం గురించి ఇంకొంత డీటైలింగ్ ఉండి ఉంటే బాగుండేది. కేవలం హీరో కోణం నుంచి అంతా చూపించి.. విలన్లను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం కూడా కొంత మైనస్ అయింది.
 
రాజశేఖర్ పూర్తిగా జుట్టు గడ్డం తెల్లబడ్డ నడివయస్కుడిగా ఆయన పాత్ర.. లుక్ కొత్తగా అనిపిస్తాయి. హీరోయిజం గురించి ఎక్కడా ఆలోచించకుండా పాత్రకు తగ్గట్లు ఆయన నటించారు.  హీరోయిన్ ముస్కాన్ కాసేపు తన అందంతో ఆకట్టుకుంది. హీరో భార్య పాత్రలో చేసిన ఆత్మీయ రాజన్ న‌టించింది.  కిషోర్.. సమీర్.. అభినవ్ గోమఠం తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు. పోలీసు అధికారి పోసాని ఓకే.
 
అనూప్ రూబెన్స్ సంగీతం పర్వాలేదు. కిన్నెర పాట ఒకటి వినసొంపుగా ఉంది. మిగతా పాటలు..  మల్లికార్జున్ నారగాని ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు ప‌ర్వాలేదు. లక్ష్మీ భూపాల మాటల్లో అంత ప‌వ‌ర్ క‌నిపించ‌లేదు. రీమేక్ కాబ‌ట్టి ఎఫెక్ట్ కనిపించలేదు. దర్శకురాలు జీవిత కూడా ఆ చిత్రాన్ని చూసి య‌తాత‌థంగా తీసేసింది. ఇది అంద‌రూ చూసే చిత్రం. మహిళా ప్రేక్ష‌కులు ఆద‌ర‌ణ‌బ‌ట్టి సినిమా ఎంత రేజ్‌లో వుంటుందో తెలుస్తుంది.