జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ ఆయన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మలు లేఖ రాశారు. చట్టబద్దంగా కుటుంబ సభ్యులకు చెందాల్సిన ఆస్తులను లాక్కోవటానికి తన సొంత తల్లి, చెల్లి మీద కూడా జగన్ కేసులు పెట్టిన విషయం తాజాగా వెల్లడైంది. దీనికి సంబంధించిన ఆధారాలతో కూడిన లేఖను టీడీపీ తాజాగా లీక్ చేసింది. ఈ లేఖలోని అనేక అంశాలను వారు సమాజానికి తెలియపరిచారు.
"మన తండ్రి ఆదేశాలకు తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ఎంఓయూని రద్దు చేయాలని కోరుతున్నారు. చట్టపరంగా మీ లేఖ ఎంఓయూకి విరుద్ధం దానికి ఏమాత్రం పవిత్రత లేదు. కానీ మీ లేఖ వెనుక ఉన్న దురుద్దేశం నాకు చాలా బాధ కలిగించింది. ఇది మన తండ్రి మీద మీకున్న గౌరవాన్ని తగ్గించే విధంగా వుంది. ఆయన ఎన్నడూ కలలో కూడా ఊహించని పని చేసారు మీరు. చట్టబద్దంగా మీ కుటుంబ సభ్యులకు చెందాల్సిన ఆస్తులను లాక్కోవటానికి సొంత తల్లి మీద, నా మీద కేసులు పెట్టారు" అని పేర్కొన్నారు.
'మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎమ్‌ఓయు ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఈ విదంగా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోంది' సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్న నువ్వు నీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు లాక్కోవటానికి సిద్ధమయ్యావా జగన్ మోహన్ రెడ్డి? అంటూ టీడీపీ ప్రశ్నించింది.
"నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెడుతుంటే, నీకు నేను ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? రాజకీయంగా నా పై విమర్శలు చేస్తున్న నీకు, నేను చిల్లి గవ్వ ఇవ్వను. సరస్వతి సిమెంట్స్ షేర్స్ తిరిగి ఇచ్చేయండి.. అమ్మ మీద, నీ మీద కేసు వేస్తున్నా" అంటూ జగన్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. జగన్‌ని సైకో అని ఎందుకు అంటారో, ఇప్పుడు తెలిసిందా? ఆస్తి కోసం, డబ్బు కోసం, సొంత తల్లి పైనే కేసులు వేసి, కోర్టుకి లాగారు. చెల్లి రాజకీయాల్లో ఉంటే తట్టుకోలేక పోతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటేనే ఆస్తులు రాసిస్తా అని బెదిరిస్తున్నారు. జగన్ రెడ్డికి విలువలు విశ్వసనీయత లేని వారని , లేఖలో రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ పేర్కొన్నారు.
"దివంగత నేత మన తండ్రి కోరికలను నెరవేర్చడానికి, చేసుకున్న అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉండటంలో మీరు మీ నైతికతను కోల్పోయారు. మీరు దాని నుండి బయట పడతారాని ఆశిస్తున్నాను. మీరు అలా చేయకూడదని నిర్ణయించుకుంటే చట్ట పరంగా ముందుకు వెళ్ళడానికి నాకు పూర్తి హక్కులు వున్నాయి. ఇవన్నీ వాస్తవాలే అని నిర్ధారించడానికి మన తల్లి కూడా ఈ లేఖపై సంతకం చేసింది" అని పేర్కొన్నారు.
'నా రాజకీయ జీవితం పూర్తిగా నాకు సంబంధించింది. నా వృత్తి పరమైన జీవితాన్ని నిర్దేశించడానికి నేను మిమ్మల్ని అనుమతించను. బహిరంగ వేదికలపై మీకు, అవినాష్‌కు వ్యతిరేకంగా మాట్లాడకుండా నాతో మీరు సంతకం చేయుంచుకున్నారన్నది అసంబద్ధం. సెటిల్‌మెంట్‌కు రావాలని నాకు షరతు విధించడం అనేది కూడా పూర్తిగా అసమంజసమైనది'.
మన తండ్రి అన్ని ఆస్తులలో తన మనవళ్లందరికీ మానవరాలకి సమాన వాటా ఉండాలని కోరుకున్నారు. అంతేగానీ దాని మీద రాజకీయమైన ప్రభావాలేవీ వుండకూడదు. నా రక్త సంబంధమైన అన్నగా మీరు ఇష్టపూర్వకంగా సంతకం చేసిన ఎంవోయూని అమలు చేయడం మీ బాధ్యత.
ఎంవోయూ ప్రకారం నా వాటాలో భాగంగా నాకు ఇవ్వబడిన సరస్వతి పవర్‌పై, ఎంవోయూ ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే దాని షేర్లన్నింటినీ నాకు బదిలీ చేస్తానని మీరు హామీ ఇచ్చారు. అయితే, మీరు చాలా సంవత్సరాలుగా హామీ నెరవేర్చడంలో విఫలమయ్యారు. మన తల్లి భారతి సిమెంట్, సండూర్‌లకు చెందిన షేర్లను పొందిన తర్వాత, మిగిలిన షేర్లను మీరు బహుమతిగా ఇచ్చిన తర్వాత కూడా ఫిర్యాదు చేయడం సరికాదు.
మీరు మన తల్లికి సరస్వతి పవర్ షేర్లపై పూర్తి హక్కులు ఇస్తూ గిఫ్ట్ డీడ్‌లపై సంతకాలు చేశారు. షేర్లతో విడిపోవడానికి అంగీకరించిన తర్వాత, మీరు ఇప్పుడు అనవసరమైన వివాదాలను లేవనెత్తడానికి, కుటుంబాన్ని కోర్టుకు తీసుకెళ్లడానికి నిర్ణయించుకున్నారు. సరస్వతీ పవర్‌లో తనకు వాటాలు లేకుండా చేయాలనే మీ ఉద్దేశ్యంతోనే ఇది జరిగింది. చట్టబద్దంగా దాని మీద నాకు పూర్తి అర్హత వుంది అని పేర్కొన్నారు.