సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (11:54 IST)

వైకాపాకు వాసిరెడ్డి పద్మ షాక్.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా

vasireddy padma
వైకాపాకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. అలాగే, ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. నిజానికి ఏపీలో వైకాపా అధికారం కోల్పోయిన తర్వాత వాసిరెడ్డి పద్మ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె బుధవారం వైకాపాకు రాజీనామా చేశారు.
 
కాగా, 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. దీంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ రాజ్యసభ సభ్వత్వాలకు రాజీనామా చేశారు. అలాగే, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేశారు.