మంగళవారం, 22 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (20:16 IST)

ఏపీలో మహిళలకు రక్షణ లేదు.. ఆ ముగ్గురు రాజీనామా చేయాలి.. రోజా

rk roja
గోపవరం ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి రోజా ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. 
 
అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయన్నారు. మహిళలపై అకృత్యాలు కట్టడి చేయలేని కూటమి సర్కారు దిగిపోవాలని.. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత తమ పదవులకు రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. 
 
బద్వేల్‌లో యువతిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం, తెనాలిలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళపై దాడి వంటి సంఘటనల గురించి రోజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
 
ఇన్ని విషాదాలు చోటు చేసుకున్నప్పటికీ బాధిత కుటుంబాలను పరామర్శించకుండా ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి టీవీ షో రికార్డింగ్‌కు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారని దుయ్యబట్టారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఒక తండ్రిగా ఈ అకృత్యాలపై స్పందించాలన్నారు. 
 
టీడీపీ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు బదులు పోలీసులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రాజకీయ పగలు, వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తోందని రోజా అభిప్రాయపడ్డారు.