ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (10:50 IST)

జగన్ ప్రచారానికి రూ.21.41 కోట్లు.. వైకాపా ఎన్నికల మొత్తం ఖర్చు రూ.328 కోట్లు

jagan
గత ఏప్రిల్, మే నెలల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలోని రాజకీయ పార్టీల్లో ఒకటైన వైకాపా విజయం కోసం భారీగా ఖర్చు చేసింది. ఈ ఒక్క పార్టీ మొత్తం 328 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ట్టు తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలో వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ యేడాది మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసిన జూన్ 6వ తేదీ వరకు మొత్తంగా చేసిన ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించింది. 
 
ఆ నివేదిక ప్రకారం, ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల కోసం రూ.328,36,60,046 కోట్ల ఖర్చు చేసింది. ఇందులో ప్రధాన ప్రచారకర్తల ప్రయాణ ఖర్చుల కోసం రూ.21.42 కోట్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, బల్క్ ఎస్ఎంఎస్‌లు, కేబుల్, వెబ్‌సైట్, టీవీ చానళ్లలో పార్టీ సాదారణ ప్రచారం కోసం రూ.87.36 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక స్టార్ క్యాంపెయినర్ల కోసం చేసిన మొత్తం ఖర్చులో రూ.21.41 కోట్లను ఒక్క జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్, విమానం, బస్సు కోసమే ఖర్చు చేసినట్టు వైకాపా సమర్పించిన నివేదికలో పేర్కొంది.