శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (16:26 IST)

జేసీ తాగొచ్చి మాట్లాడితే గొప్పా.. ట్రంప్‌కు అమ్మలా మాట్లాడితే నాలుక కోస్తాం: శ్రీకాంత్ రెడ్డి

009లో పోలవరం ప్రాజెక్ట్‌కి జాతీయాహోదా కోసం వైయస్సార్ కృషి చేస్తే చంద్రబాబు అడ్డుపడ్డాడని గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఏమి జరిగిందో నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం పట్టిసీమకు తాము వ్యతి

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఏకిపారేశాడు. జగన్ ఏమాట్లాడుతాడో వాడికే తెలియదన్నారు. ప్రజల ఓట్లు కావాలనుకునే వారు పట్టిసీమను వ్యతిరేకిస్తారా...ప్రజలందరూ పోలవరం కావాలని కోరుకుంటుంటే జగన్ ఎందుకు వ్యతిరేకిస్తూన్నాడో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాజశేఖర్‌రెడ్డితో ఉన్న అనుబంధం వల్ల జగన్ చిన్నప్పటి నుంచి తనకు తెలుసుసని దివాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. జగన్‌కు తిట్టడం తప్ప మరొకటి తెలియదన్నారు.
 
రాయలసీమ రెడ్లకు కులపిచ్చి ఎక్కువ అని, వారు కుల పిచ్చిని వీడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మరోసారి సీఎం కావాలని ఆకాంక్షించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కులపిచ్చి పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
 
జేసీ ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారిది కాదా ప్రశ్నించారు. 2009లో పోలవరం ప్రాజెక్ట్‌కి జాతీయాహోదా కోసం వైయస్సార్ కృషి చేస్తే చంద్రబాబు అడ్డుపడ్డాడని గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఏమి జరిగిందో నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం పట్టిసీమకు తాము వ్యతిరేకం అనటం వాస్తవం కాదని చెప్పుకొచ్చారు. ట్రంపుకి అమ్మలా జేసీ మాటలుంటున్నాయని ఎద్దేవా చేశారు. జేసీ తాగొచ్చి మాట్లాడారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
రూ.95 వేలకోట్ల సాగునీటి ప్రాజెక్టులకి వైయస్ 2004 నుంచి ఖర్చు చేశారని తెలిపారు. జేసీని అడ్డం పెట్టుకుని ముఖమంత్రి మాట్లాడిస్తున్నారని దుయ్యబట్టారు. జేసీ గత చరిత్ర ఎవరికి తెలియదని, జేసీ జగన్‌ని తిడితే చంద్రబాబు ఆనందపడుతున్నారని అన్నారు. పట్టిసీమను తాము వ్యతిరేకిస్తున్నామంటే నాలుక కోస్తామని హెచ్చరించారు.
 
పట్టిసీమ నుంచి రాయలసీమకు నేరుగా నీళ్ళెలా ఇస్తారని, దమ్ముంటే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లిస్తామని శ్వేతపత్రం విడుదల చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జేసీ తన మాటలు వెనక్కు తీసుకోకపోతే ఆయన ఆఖరి రాజకీయ జీవితంలో చెడ్డ పేరు మిగిలిపోతుందని హెచ్చరించారు. నియోజకవర్గంలో శాసనసభ్యునికి కాకుండా మరెవరికి ప్రమేయం ఉంటుందని ప్రశ్నించారు.