శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (19:22 IST)

వైఎస్సార్‌ వాహనమిత్ర: రూ.248.46 కోట్లు కేటాయింపు

వైఎస్సార్‌ వాహనమిత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున రూ.248.46 కోట్లు వారి బ్యాంక్ అకౌంట్లలో వెయ్యనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ను ప్రారంభించి వారికి అండగా నిలవనున్నారు. 
 
ఈ పథకం కింద గతేడాది 2లక్షల 24వేల 777మంది లబ్ధిదారులుగా ఉండగా.. ఈ ఏడాది 2,05,536 మంది అర్హులుగా తేలారు. వాహనాలను విక్రయించడం, ఇతరత్రా కారణాలతో 19,241మంది అనర్హులయ్యారు. వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కోసం ఈ ఏడాది కొత్తగా 46,237 మంది దరఖాస్తు చేసుకోగా.. దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో 42,932 మందిని అర్హులుగా నిర్ధారించారు. 
 
మొత్తం మీద పాత, కొత్త రిజిస్ట్రేషన్లు కలిపి 2,71,014 మందిలో 2,48,468 మందిని అర్హులుగా నిర్ధారించారు. మొత్తం లబ్ధిదారుల్లో 83 శాతం మంది.. అంటే 2,48,468 మందిలో 2,07,974 మంది బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలవారు.