గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 19 మే 2021 (16:25 IST)

తమ అన్ని బ్రాండ్లపై ఉచిత సర్వీస్‌ పీరియడ్‌ను విస్తరించిన బజాజ్‌ ఆటో

ప్రపంచం అభిమానించే భారతీయుడు బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, భారతదేశంలో తమ అన్ని బ్రాండ్స్‌పై ఉచిత సర్వీస్‌ కాలాన్ని కోవిడ్‌ 19 మహమ్మారి సెకండ్‌ వేవ్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్స్‌ లేదంటే ప్రయాణాలపై చాలా రాష్ట్రాలలో నిబంధనలను విధించడం వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని పొడిగించింది. తమ వినియోగదారులకు మద్దతును కొనసాగించే క్రమంలో బజాజ్‌ ఆటో ఇప్పుడు తమ ఉచిత సేవా ప్రయోజనాలను 31 జూలై 2021 వ తేదీ వరకూ పొడిగించింది.
 
ఏప్రిల్‌ 01,2021 మరియు 31 మే 2021వ తేదీల నడుమ ఉచిత సర్వీస్‌ కాలం ముగిసే వాహనాలకు ఇప్పుడు ఈ ఉచిత సర్వీస్‌ను జూలై 31, 2021వ తేదీ వరకూ పొడిగించారు. ఈ పొడిగించిన ఉచిత సేవా కాలం అన్ని ద్వి చక్రవాహనాలు మరియు వాణిజ్య వాహనాలపై లభ్యమవుతుంది.
 
ఈ కార్యక్రమం గురించి శ్రీ రాకేష్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘కోవిడ్‌ 19 మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏర్పడిన సంక్షోభంతో మా వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను మేము పరిగణలోకి తీసుకున్నాం. గతసంవత్సరం లాగానే, తాము మరో మారు సేవా కాలాన్ని రెండు నెలలు పొడిగించాం. తద్వారా మా వినియోగదారులందరికీ వారి వాహనాలను కాపాడగలమనే భరోసా అందిస్తున్నాం’’ అని అన్నారు.
 
తమ వినియోగదారులందరికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తమడీలర్‌షిప్‌ల ద్వారా ఈ ప్రయోజనాలు చేరతాయనే భరోసాను బజాజ్‌ ఆటో అందిస్తుంది.