శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 16 మే 2021 (18:23 IST)

1000 భారీ మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల కన్సైన్‌మెంట్‌‌ను ఎయిర్‌లిఫ్ట్‌ చేసిన గ్రీన్‌కో గ్రూప్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కలిగి, భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్ధలలో ఒకటిగా వెలుగొందుతున్న గ్రీన్‌కో గ్రూప్‌, అంతర్జాతీయ సరఫరా చైన్‌ నెట్‌వర్క్‌ను వినియోగించుకుని అత్యంత క్లిష్టమైన ఆక్సిజన్‌ మద్దతు వ్యవస్థలను భారతదేశానికి తీసుకువచ్చింది. అదే సమయంలో అత్యంత క్లిష్టమైన ఆక్సిజన్‌ను వీలైనంత త్వరగా దేశీయంగా పంపిణీ చేయడానికి అత్యుత్తమ ప్రయత్నాలనూ చేస్తోంది. దీనికోసం పూర్తిగా అంకితం చేసిన ఐదు కార్గో విమానాలలో తొలి కార్గో విమానం నేడు హైదరాబాద్‌లో 200 భారీ మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లతో ల్యాండ్‌ అయింది. ఈ కాన్‌సన్‌ట్రేటర్లు నిమిషానికి 10 లీటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అత్యంత భయంకరమైన కోవిడ్‌ 19 మహమ్మారి రెండవ వేవ్‌తో పోరాడుతున్న భారతదేశానికి ఇవి తోడ్పాటునందించనున్నాయి.
 
తెలంగాణా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్‌, పురపాలక వ్యవహారాలు మరియు నగరాభివృద్ధి, పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ కెటీ రామారావుతో పాటుగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌లు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కాన్‌సన్‌ట్రేటర్లను అందుకున్నారు. గ్రీన్‌కో కో-ఫౌండర్లు శ్రీ అనిల్‌ చలమలశెట్టి మరియు శ్రీ మహేష్‌ కొల్లి సైతం ఈ కార్గో విమానాల తొలి రాకను స్వాగతిస్తూ విమానాశ్రయంలో హాజరయ్యారు.
 
విమానాశ్రయంలో పాత్రికేయులతో ముచ్చటించిన గ్రీన్‌కో గ్రూప్‌ ఎండీ అండ్‌ సీఈవో శ్రీ అనిల్‌ చలమలశెట్టి తమ గ్రీన్‌కో గ్రూప్‌ ప్రణాళికలను వెల్లడిస్తూ, ‘‘గత రెండు వారాలలో తాము ఏర్పాటు చేసిన శక్తివంతమైన అంతర్జాతీయ నెట్‌వర్క్‌ ద్వారా తాము ఏర్పాటు చేసిన ఐదు కార్గో విమానాలలో తొలి బ్యాచ్‌ను తాము అందుకున్నాం. రాబోయే ఐదు రోజులలో, మరో నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌లు హైదరాబాద్‌, బెంగళూరు, న్యూఢిల్లీలలో 1000 భారీ మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లతో రానున్నాయి.
 
ఇది టియర్‌ 2, టియర్‌ 3 నగరాలలోని వైద్య సిబ్బందికి ఐసీయు ముందుస్తు మద్దతనందించడంతో పాటుగా రోగుల ఐసీయు స్టెబిలైజేషన్‌ తరువాత కూడా తోడ్పడనున్నాయి. దానితో పాటుగా మన ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులు, మద్దతు వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్న కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో పోరాడేందుకు సైతం తోడ్పడనున్నాయి. దేశానికి తోడ్పాటునందించేందుకు మా కార్యకలాపాలను కొనసాగించనున్నాం మరియు మహమ్మారితో పోరాటానికి తోడ్పాటునందిస్తూనే భారతదేశం ఈ మహమ్మారి నుంచి విముక్తి పొంది స్వేచ్ఛగా శ్వాసించేందుకు తోడ్పాటునందించనున్నాం’’ అని అన్నారు.
 
గ్రీన్‌కో ప్రయత్నాలకు ధన్యవాదములు తెలిపిన గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ కె.టి.రామారావు మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వ పరంగా మాత్రమే గాక వ్యాపారవేత్తలు, బాధ్యతాయుతమైన పౌరులు రోగులకు తగిన రీతిలో ఉపశమనం అందించడం తొలి ప్రాధాన్యతగా ఉండాలి మరియు ఈ ఆక్సిజన్‌ సంక్షోభాన్ని సాధ్యమైనంత వరకూ తొలగించేందుకు ప్రయత్నించాల్సి ఉంది. ఈ ప్రయత్నాలలో తమకు తోడ్పడిన గ్రీన్‌కో గ్రూప్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము’’ అని అన్నారు
 
అదనంగా, 50 లీటర్ల సామర్థ్యం కలిగిన 1000 భారీ ఆక్సిజన్‌ సిలెండర్‌లను మిడిల్‌ ఈస్ట్‌ నుంచి భారతదేశానికి రాబోయే వారం రోజులలో తరలించనున్నారు. ఈ వ్యవస్థలను ఆస్పత్రిలు, హెల్త్‌కేర్‌ యూనిట్లు మరియు మొబైల్‌ యూనిట్లలో స్టేషనరీ యూనిట్లుగా నిలుపడంతో పాటుగా ఆక్సిజన్‌ సమస్య ఎదుర్కొంటున్న రోగులకు అదనంగా తోడ్పడేందుకు వినియోగించనున్నాం.
 
భారతదేశంలో అతిపెద్ద స్వచ్ఛమైన ఇంధన కంపెనీలలో గ్రీన్‌కో గ్రూప్‌ ఒకటి. విశ్వసనీయ మరియు మధ్యకాలిక సరఫరా గొలుసుకట్టు వ్యవస్థలను ఏర్పాటుచేయడంపై దృష్టి కేంద్రీకరించడంతో పాటుగా దౌత్య, భౌగోళిక, రాజకీయ, రవాణా మార్గాలను అన్వేషిస్తుంది. తద్వారా ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్‌ సిలెండర్లు సహా అత్యవసరాలను భారతదేశంలో పలు రాష్ట్రాలకు సరఫరా చేయగలమని నిర్ధారిస్తుంది.
 
‘‘ఓ దేశంగా, సహాయం/విరాళాలను ద్రవ్య రూపంలో మాత్రమే కాకుండా ద్రవ్యేతర రూపంలో కూడా పొందగలడం మన అదృష్టం, కానీ అత్యంత క్లిష్టమైన యంత్ర సామాగ్రి మరియు సరఫరాలను స్థానికంగా, అంతర్జాతీయంగా సరఫరా చేసేందుకు విస్తృతస్థాయిలో సరఫరా చైన్స్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. గ్రీన్‌కో గ్రూప్‌ వద్ద తాము ఈ తరహా సరఫరా చైన్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటుగా 5వేలకు పైగా కాన్‌సన్‌ట్రేటర్లు మరియు సిలెండర్లను ఏకధాటిగా సరఫరా చేసే సామర్థ్యం సంతరించుకున్నాం. ఇవి భారతదేశం మహమ్మారితో పోరాడేందుకు, మరోమారు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేందుకు తోడ్పడగలవని ఆశిస్తున్నాం’ అని శ్రీ అనిల్‌ చలమలశెట్టి అన్నారు.