శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 15 మే 2021 (19:34 IST)

తమ వారెంటీని పొడిగించిన యమహా, హ్యుందాయ్‌

కోవిడ్‌ 19 మహమ్మారి రెండవ వేవ్‌ విజృంభణ కొనసాగుతుండటంతో తమ వినియోగదారుల హక్కులను కాపాడటాన్ని విశ్వసించే బాధ్యతాయుత కంపెనీలుగా ఇండియా యమహా మోటర్‌ సంస్థతో పాటుగా హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌‌లు తమ సర్వీస్‌, వారెంటీ సమయాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించాయి.

తమ యమహా లైఫ్‌టైమ్‌ క్వాలిటీ కేర్‌ అప్రోచ్‌లో భాగంగా ఈ వారెంటీని జూన్‌ 30, 2021వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు యమహా వెల్లడించగా, హ్యుందాయ్‌ సంస్థ లాక్‌డౌన్‌ జరుగుతున్న ప్రాంతాలలో వారెంటీని రెండు నెలల పాటు తమ వారెంటీని పొడగిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ వారెంటీలో భాగంగా ఉచిత సర్వీస్‌, సాధారణ వారెంటీ, ఎక్స్‌టెండెడ్‌ వారెంటీని సైతం విస్తరిస్తున్నట్లు వెల్లడించాయి ఈ సంస్థలు. యమహా తమ వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్‌ను సైతం జూన్‌ 30, 2021వ తేదీ వరకూ పొడగిస్తున్నట్లు వెల్లడించగా, హ్యుందాయ్‌ సంస్థ తాము ఆన్‌లైన్‌ సర్వీస్‌ బుకింగ్‌తో పాటుగా మరెన్నో సదుపాయాలనూ అందిస్తున్నట్లు వెల్లడించింది.