శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 17 మే 2021 (17:11 IST)

120 మిలియన్‌ డాలర్లను సమీకరించిన మోగ్లిక్స్, యునికార్న్‌ క్లబ్‌లో చేరిక

తయారీ రంగంలో మొట్టమొదటి పారిశ్రామిక బీ2బీ వాణిజ్య వేదికగా నిలువడం ద్వారా అతి ముఖ్యమైన మైలురాయిని మోగ్లిక్స్‌ చేరుకుంది. ఈ కంపెనీ ఇప్పుడు ఒక బిలియన్‌ డాలర్ల కంపెనీగా తమ తాజా 120 మిలియన్‌ డాలర్ల సిరీస్‌ ఈ ఫండింగ్‌ రౌండ్‌ తరువాత నిలిచింది. ఈ తాజా పెట్టుబడులకు ఫాల్కన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌ మరియు హార్వార్డ్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (హెచ్‌ఎంసీ)లు నేతృత్వం వహించాయి. ఈ దశ ఫండింగ్‌లో తమ ప్రస్తుత మదుపరులు, టైగర్‌ గ్లోబల్‌, సీక్వోయా క్యాపిటల్‌ ఇండియా మరియు వెంచర్‌ హైవేలు సైతం పాల్గొన్నాయి.
 
భారతదేశంలో పారిశ్రామిక మరియు ఎంఆర్‌ఓ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగంలో స్పష్టమైన ఫస్ట్‌ మూవర్‌ అడ్వాంటేజ్‌తో అతిపెద్ద, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బీ2బీ వాణిజ్య వేదికగా మోగ్లిక్స్‌ నిలిచింది. ఈ కంపెనీ ఇప్పుడు ఓ నిర్వహణ వ్యవస్థను తయారీ కోసం అభివృద్ధి చేసింది. ఇది వినియోగదారులకు పూర్తిస్థాయి సేవలను సేకరణ, ప్యాకేజింగ్‌, సరఫరా చైన్‌ ఫైనాన్సింగ్‌ మరియు అత్యున్నతమైన ఇంటిగ్రేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ పరంగా అందిస్తుంది.
 
రాహుల్‌ గార్డ్‌, ఫౌండర్‌ అండ్‌ సీఈవో, మోగ్లిక్స్‌ మాట్లాడుతూ, ‘‘భారతీయ తయారీ రంగంలో ఒడిసిపట్టని సామర్ధ్యం చేజిక్కుంచుకోగలమనే గట్టి నమ్మకంతో ఆరేళ్ల క్రితం తాము కార్యకలాపాలను ఆరంభించాం. రతన్‌ టాటా లాంటి మహోన్నత వ్యక్తుల నమ్మకాన్ని సైతం తాము పొందడంతో పాటుగా భారతదేశంలో ఒక ట్రిలియన్‌ డాలర్ల తయారీ ఆర్థిక వ్యవస్ధను సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. నేడు, తాము తరువాత దశ పరిణామంలో ప్రవేశించాం. ఈ ఆర్ధిక మైలురాయి తమ ఆవిష్కరణ మరియు వైవిధ్యమైన ప్రయాణానికి మైలురాయిగా నిలుస్తుంది.
 
ఈ సంక్షోభ సమయంలో, తాము తమ మద్దతు మరియు వైవిధ్యమైన ఆలోచనలను ప్రభావవంతమైన పంపిణీ మరియు ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లను ఒక మిలియన్‌కు పైగా ప్రజలకు దేశంలో పంచుకోవడంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అందించనున్నాం. అంతర్జాతీయంగా, తాము అత్యంత కీలకంగా ఈ విషయంలో వ్యవహరిస్తుండటంతో పాటుగా గత సంవత్సరం పీపీఈ సరఫరా చైన్‌ మరియు పంపిణీని 20కు పైగా దేశాలలో చేశాం.
 
ఫాల్కన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌ మరియు హార్వార్డ్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (హెచ్‌ఎంసీ)లు ఈ ప్రయాణంలో తమతో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాం. ఫాల్కన్‌ ఎడ్జ్‌, మిడిల్‌ ఈస్ట్‌ మరియు యూరోప్‌లో బలీయమైన మూలాలు కలిగి ఉంది మరియు పబ్లిక్‌ కంపెనీలను అర్థం చేసుకోవడంలో దాని నైపుణ్యం మా తరువాత దశ ప్రయాణంలో మార్గనిర్దేశనం చేయనుంది’’ అని అన్నారు.
 
ఈ సందర్భంగా నవ్రోజ్‌ డీ ఉడావాడియా, కో-ఫౌండర్‌, ఫాల్కన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌ మాట్లాడుతూ, ‘‘గత కొద్ది సంవత్సరాలుగా మేము మోగ్లిక్స్‌ను అధ్యయనం చేయడంతో పాటుగా ఆన్‌లైన్‌ ఎంఆర్‌ఓ ప్లాట్‌ఫామ్స్‌పై పెట్టుబడులు పెట్టడంలో మా అంతర్జాతీయ అనుభవం తోడుగాఆ సంస్థ ప్రయాణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. రాహుల్‌ను మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. అతని ఫస్ట్‌ మూవర్‌ అడ్వాంటేజ్‌తో పాటుగా సరిగా సేవలు అందని వినియోగదారుల కోసం అతని ఫుల్‌ స్టాక్‌ సొల్యూషన్‌, విస్తృతశ్రేణి యూనిట్‌ ఆర్థికవ్యవస్థలపై ఆయన సామర్థ్యం అమోఘం. మోగ్లిక్స్‌ యొక్క వైవిధ్యమైన వినియోగదారుల విలువ ప్రతిపాదన, ఆర్‌ఓఐలు అసాధారణ వినియోగదారులు మరియు రెవిన్యూ రిటెన్షన్‌ సంఖ్యల పరంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోగ్లిక్స్‌ ఇప్పుడు విస్తరించేందుకు తగిన వాతావరణం కలిగి ఉందని మేము నమ్ముతున్నాం. కంపెనీ తరువాత దశ వృద్ధిలో భాగం కావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
 
2019లో సిరీస్‌ డీ రౌండ్‌లో పాల్గొన్న టైగర్‌ గ్లోబల్‌, తాజా రౌండ్‌లో సైతం పాల్గొంది. స్కాట్‌ షెలిఫెర్‌, పార్టనర్‌, టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ మాట్లాడుతూ, ‘‘ఈ బృందం, మార్కెటింగ్‌ అవకాశాలు, స్థిరమైన ఆవిష్కరణ పట్ల మేము చాలా ఆసక్తిగా ఉన్నాము. మోగ్లిక్స్‌ ఇప్పుడు మార్కెట్‌ అగ్రగామి. క్యాపిటల్‌పై అత్యధిక రాబడులతో వారు వేగంగా వృద్ధి చెందగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.