శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 28 జులై 2017 (16:10 IST)

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమా...? ఎలా?

త్వరలో జరిగే నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంటే వైసిపి ఎలా గెలుస్తుందనేదే ప్రశ్న. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థే వైసిపికి ఉన్నారు. దాంతోపాటు చంద్రబ

త్వరలో జరిగే నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంటే వైసిపి ఎలా గెలుస్తుందనేదే ప్రశ్న. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థే వైసిపికి ఉన్నారు. దాంతోపాటు చంద్రబాబునాయుడు కాస్త కర్నూలు జిల్లాలో మొన్నీమధ్య చేసిన వ్యాఖ్యలు మైనస్ అయ్యాయని అంటున్నారు. అందుకే నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.
 
భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాలకు ఉపఎన్నికలు వచ్చాయి. సాధారణంగా ఎవరైనా మరణిస్తే ఆ ప్రాంతంలో మరో అభ్యర్థిని పెట్టరు. కానీ ప్రతిపక్షం అవేవీ పట్టించుకోకుండా ఎన్నికల్లోకి వెళ్ళింది. నంద్యాలకు ఆగష్టు 23వ తేదీన పోలింగ్, 28వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా కుటుంబానికే చెందిన బ్రహ్మానందరెడ్డి ఉండగా, వైసిపి తరపున శిల్పామోహన్ రెడ్డిలు ఉన్నారు. 
 
శిల్పామోహన్ రెడ్డి ఇంతకుముందే టిడిపిలో ఉన్నారు. అయితే శిల్పాకు సీటు లభిస్తుందా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతుండడంతో మెల్లగా మారిపోయారు. విజయంలో తెలుగుదేశం పార్టీ కంటే వైసిపి అభ్యర్థికే ఎక్కువ అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాగైనా నంద్యాల సీటును సంపాదించాలని బాబు గట్టి పట్టుదలతో ఉన్నారు.