శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (12:05 IST)

బాబు పాలనలో మహిళలకు రక్షణ ఎక్కడ.. విజయవాడలోనే 70 రేప్‌లు : ఎమ్మెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని, సీఎం చంద్రబాబు పాలనలో ఒక్క విజయవాడలోనే 70 రేప్‌లు జరిగాయని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఆరోపించారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ... సీఎంముఖ్యమంత్రి చంద్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని, సీఎం చంద్రబాబు పాలనలో ఒక్క విజయవాడలోనే 70 రేప్‌లు జరిగాయని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఆరోపించారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ... సీఎంముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ సాంబశివరావులు ఉన్న విజయవాడలోనే 70 రేప్‌లు జరిగాయని... ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. 
 
బాబు హయాంలో క్రైమ్ రేట్ 11 శాతం పెరిగిందని పోలీసు రికార్డులే చెబుతున్నాయన్నారు. మహిళల కోసం తాను పోరాటం చేస్తున్నందువల్లే, తనపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. తనను అడ్డుకునే ప్రయత్నం ఎంత చేసినా... తాను మాత్రం పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పారు. కోర్టులు న్యాయం చేస్తాయనే నమ్మకం తనకు ఉందన్నారు. 
 
ఇకపోతే.. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆహ్వానం పంపి అవమానించారన్నారు. నేషనల్ ఉమెన్ పార్లమెంటు అంటే కోడెల కుమార్తె, చంద్రబాబు కోడలు, కేసీఆర్ కుమార్తెలకే మహిళా సాధికారత కావాలా? ఇతరులు మహిళలు కాదా? అని ఆమె ప్రశ్నించారు. రెండు సార్లు ఆహ్వానం పంపిన స్పీకర్ కోడెల తనను అడ్డుకోవడంపై ఎందుకు నోరు విప్పలేదన్నారు. ఉమెన్ పార్లమెంట్ అంటే భజనపరుల సమావేశమా? అని ఆమె అడిగారు. ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లో డీజీపీ నడుస్తున్నారని ఆమె ఆరోపించారు.