శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (11:33 IST)

వైసీపీ మహిళా ఎమ్మెల్యే బుగ్గగిల్లిన బుడతడు... వీడియో వైరల్

సోషల్ మీడియాలో ప్రస్తుతం గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే రజనీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. నియోజకవర్గంలో తిరుగుతూ అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు ఓ బుడతడు షాక్ ఇచ్చాడు. 
 
నియోజకవర్గ ప్రజల్ని కలుస్తు వస్తున్న ఆమెను ఓ స్కూల్ విద్యార్థి అకస్మాత్తుగా బుగ్గగిల్లాడు. బుగ్గ గిల్లి ముద్దు కూడా ఇచ్చాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామాతో ఎమ్మెల్యే రజని షాక్ తిని.. ఆ తర్వాత సర్ ప్రైజ్‌గా ఫీలయ్యారు. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వులు పూయించారు. 
 
అయితే ఆ పిల్లాడు ఎంతో అప్యాయంగా ఎమ్మెల్యేకు ముద్దివ్వడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్స్ కూడా ఈ చిన్నపిల్లాడు చేసిన పని సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.