గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-04-2021 సోమవారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా విన్నా...

మేషం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో, ఒప్పందాల్లో మెళకువ వహించండి. 
 
వృషభం : విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిదికాదని గమనించండి. 
 
మిథునం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహన చోదకులకు చికాకులు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించడం. సాహస ప్రయత్నాలు విరమించండి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
కర్కాటకం : నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేస్తారు. రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
సింహం : ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకలు ఎదురైనా అధికమిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ, సహకంచేవారుండరు. కోర్టు పనులు కొంత మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. 
 
కన్య : ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత అవసరం. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. గృహం ఏర్పరచుకోవాలనే కోరిక బలపడుతుంది. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. 
 
తుల : మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త పథకాలు వేస్తారు. పెద్దల ఆరోగ్యం నిరుత్సాహపరుస్తుంది. ఓర్పు, నేర్పుతో వ్యవహరించడం ఎంతైనా అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. రుణ విముక్తులు కావడంతో మానసిక ప్రశాంతత పొందుతారు. పత్రికా రంగంలోని వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది. 
 
వృశ్చికం : దూర ప్రయాణాలలో బ్యాంకింగ్ వ్యవహారాలలో అప్రమత్త ఎంతో అవసరం. ఇతరులపై ఆధారపడక స్వశక్తితోనే మీ పనులు పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. ఒక కార్యం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
ధనస్సు : స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తులవారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ఆటంకాలు తప్పవు. స్త్రీలకు టీవీ చానెళ్ల నుంచి ఆహ్వానాలు అందుతాయి. 
 
మకరం : ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళన తప్పదు. ఒక్కసారి ప్రేమిస్తే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఎంతైనా పోరాడుతారు. మిమ్మల్ని అభిమానించే వ్యక్తల మనస్సులను బాధపెట్టకండి. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ఆకర్షణలకు దూరంగా ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. 
 
కుంభం : స్త్రీల ఆరోగర్యంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. సజ్జన సాంగత్యం, ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ ధైర్య సాహసాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీయానాలకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. 
 
మీనం : బ్యాంకు పనులు మందగిస్తాయి. వృత్తి వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి.