17-06-2021-గురువారం మీ రాశి ఫలితాలు.. వినాయకుడి ఆరాధిస్తే..?

Vinayaka
Vinayaka

వినాయకుడిని ఆరాధిస్తే సంకల్పసిద్ధి, మనోసిద్ధి పొందుతారు. 
 
మేషం: మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు ఇబ్బంది కలిగిస్తాయి. ధనం నిల్వచేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. స్త్రీలకు తల, నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు తప్పవు. బ్యాంకు వ్యవహారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. 
 
వృషభం: మీ మాటే నెగ్గాలనే పట్టుదల మంచిది కాదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. బంధువులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించి చికాకులు ఎదుర్కొంటారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. 
 
మిథునం: విదేశీయానం, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. స్త్రీలకు బంధువుల రాకతో పనిభారం అధికమవుతుంది. వీసా, పాస్‌పోర్టులకు సంబంధించిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. 
 
కర్కాటకం: ఉమ్మడి నిధుల నిర్వహణలో మాటపడాల్సి వస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి వస్తుంది. విదేశీయాన యత్నాలు ముమ్మరం చేస్తారు. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
సింహం: హోటల్, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మీ సంతానం ఉన్నత విద్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఉన్నతస్థాయి అధికారుల ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కన్య: అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ప్రేమికుల అనాలోచిత చర్యల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత ఉన్నా మునుముందు సత్ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలు అనుకూలిస్తాయి. ఊహించని వ్యక్నుంచి ఆహ్వానాలు అందుతాయి. 
 
తుల : ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా క్రమంగా సమసిపోతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ పథకాలు, ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. కాంట్రాక్టర్లు నూతన టెండర్లు చేజిక్కించుకుంటారు. పత్రికా సంస్థల్లోని వారి విధినిర్వహణలో చిన్న చిన్న తప్పులు దొర్లే ఆస్కారం వుంది. 
 
వృశ్చికం: రాబోయే ఆదాయానికి తగినట్లుగా లెక్కలు వేసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అందివచ్చిన అవకాశం చేజారినా, ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. 
 
ధనస్సు: వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోభివృద్ధి ఉండదు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సన్నిహితులు మీ యత్నాలకు సహాయసహకారాలు అందిస్తారు. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 
 
మకరం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు అందుతాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లోని పనులు సానుకూలమవుతాయి. వాహనం నడుపునప్పుడు మెళకువ అవసరం. కొత్త ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. 
 
కుంభం: వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. రేపటి గురించి ఆలోచనలు అధికం కాగలవు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. పెరిగిన ధరలు చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఆధ్యాత్మిక, దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మీనం: అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. వాహన చోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. 


வெப்துனியா செய்திகள் உடனுக்குடன்!!! உங்கள் மொபைலில்... இங்கே க்ளிக் செய்யவும்
దీనిపై మరింత చదవండి :