01-05-2026 శుక్రవారం ఫలితాలు - తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది
01-05-2026
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. వ్యవహారాలతో తీరిక ఉండదు. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. పాత పరిచయస్తులు తారసపడతారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రత్యేక గుర్తింపు పొందుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు సానుకూలమవుతాయి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
యత్నం ఫలించకున్నా కుంగిపోవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అనవసర జోక్యం తగదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఖర్చులు విపరీతం. ఆపత్సమయంలో ఆప్తులు ఆదుకుంటారు.
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయవద్దు. వ్యవహారంలో తప్పటడుగు వేస్తారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చేపట్టిన పనులు సాగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. కొత్తయత్నాలు మొదలెడతారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పబలం కార్యోన్ముఖులను చేస్తుంది. లక్ష్యసాధనకు పట్టుదలతో శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పనులు సానుకూలమవుతాయి. చర్చల్లో పాల్గొంటారు. ఆహ్వానం అందుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం అందదు. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. కీలక వ్యవహారంలో మెలకువ వహించండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. శ్రమించినా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. తెలియని వెలితి వెన్నాడుతుంది. అతిగా ఆలోచింపవద్దు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణ విముక్తులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు సామాన్యం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఉత్సాహంగా గడుపుతారు. బుద్ధిబలంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో ఆటంకాలెదురు కాకుండా జాగ్రత్త వహించండి.
తర్వాతి కథనం
