1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 28-04-2026 Daily Astrology

28-04-2026 మంగళవారం ఫలితాలు - కానుకలిచ్చిపుచ్చుకుంటారు...

Daily Astrology
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలు పురోగతిన సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్ని విధాలా యోగదాయకమే. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వహించండి. ఖర్చులు విపరీతం. కీలక పత్రాలు అందుకుంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి అతి చొరవ ఇబ్బంది కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కలిసివచ్చే సమయం. నిరుత్సాహం వీడి శ్రమించండి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. వేడుకను ఘనంగా చేస్తారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పిల్లల అత్యుత్సాహం అదుపుచేయండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. శుభకార్యం నిశ్చ, యమవుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహస్థితి ఏమంత అనుకూలం కాదు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. చర్చల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధైర్యంగా ముందుకెళతారు. ఆదాయానికి ధనసహాయం తగదు. పనులు ఒక పట్టాన పూర్తికావు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. ఉత్సాహంగా శ్రమించండి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. మీ ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ సమర్ధతపై నమ్మకం కలుగుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనసహాయం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. సలహాలు ఆశించవద్దు. వ్యతిరేకులు తప్పుదారి పట్టిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తి చేయగల్గుతారు. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
మంగళవారం నాడు ప్రదోషం వస్తే.. భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే?