సంబంధిత వార్తలు
25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహార ఒప్పందాల్లో, జాగ్రత్త. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దల సలహా తీసుకోండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. పనులు, బాధ్యతల అప్పగించవద్దు. కొత్తయత్నాలు మొదలెడతారు. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య కలహం, ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. దైవకార్యంలో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంతోషకరమైన వార్త వింటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. ఖర్చులు సామాన్యలు చెల్లింపుల్లో లక్షల నగదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఒత్తిడికి గురికావద్దు, మాటతీరు అదుపులో ఉంచుకోండి. ససుల్లో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తవుతాయి. దుబారా ఖర్చులు సంగీతం. కీలక వ్యవహారంలో తప్పటడుగు వేస్తారు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. వస్త్ర, వాహన సౌఖ్యం ఉన్నాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు ఇతరులకు పురమాయించవద్దు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు కృషి ప్రధానం. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత నహించండి. సాయం ఇతరులకు అందించవద్దు. ఓర్పు, స్వయంకృషితో జాప్యం సాధ్యమవుతుంది. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ధార్మిక సేవా సంస్థలకు విరాళాలందిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. పనులు వేగవంతమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక వార్త సంతోషాన్నిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఏకాగ్రతతో మెలగండి. వ్యవహారాల్లో తొందరపాటుతనం తగదు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధాకాదు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. బాధ్యతలు అప్పగించవద్దు. అవసర జోక్యం తగదు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. ఖర్చులు విపరీతం.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్ధికంగా బాగున్నా ధనం మితంగా ఖర్చుచేయండి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. దంపతులు మధ్య కలహం, ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పత్రాలు అందుకుంటారు. శుభకార్యంలో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. కొంతమొత్తం పొదుపు చేయగలుగుతారు. పనులు వేగవంతమవుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. వేడుకకు హాజరవుతారు. ఆత్మీయులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం, కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి సాయం ఆశించవద్దు. పొదుపునకు ఆస్కారం లేదు. పత్రాల రెన్యువల్ అలక్ష్యం తగదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి.
