1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 30-04-2026 Daily Astrology

30-04-2026 గురువారం ఫలితాలు - గ్రహసంచారం బాగుంది

Daily Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. ముఖ్యులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాదనలకు దిగవద్దు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. యత్నాలు కొనసాగించండి. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహసంచారం బాగుంది. కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. ఖర్చులు సామాన్యం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పనుల్లో శ్రమ అధికం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు స్వయంగా చూసుకోండి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిసారిస్తారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ధనసహాయం తగదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. రావలసిన ధనం అందుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. పనులు వేగవంతమవుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. నగదు, పత్రాలు జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. వ్యవహారానుకూలత ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అపజయాలకు కుంగిపోవద్దు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు పురమాయించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆదుకుంటారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. నోటీసులు అందుకుంటారు. 
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
01-05-2026 నుంచి 31-05-2026 వరకు మీ మాస ఫలితాలు