గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-04-2023 - గురువారం రాశిఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం...

Pisces
మేషం :- ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పొల్గొంటారు. స్త్రీలకు గృహంలో ఒక శుభకార్యం చేయాలన్న ఆలోచన స్ఫురిస్తుంది. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఊహించని చికాకులెదురవుతాయి. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి.
 
వృషభం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులను విమర్శించుట వలన చికాకులను ఎదుర్కొంటారు. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.
 
మిథునం :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. స్త్రీలు అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందుతుంది. నిరుద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో చికాకులు, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు పనిభారం, శ్రమాధిక్యత తప్పవు. చిన్నతరహా పరిశ్రమలు, చేతివృత్తులవారికి కలిసిరాగలదు. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయమవుతుంది. వాహన సౌఖ్యం పొందుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనవ్యయం చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం.
 
సింహం :- రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన ఫలితం పొందుతారు. ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. ప్రతీ విషయంలోను ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది.
 
కన్య :- వ్యాపార వర్గాల వారికి పన్నులు, ప్రభుత్వ విధానాలు ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులు సదావకాశాలు జారవిడుచుకుంటారు. స్త్రీలకు బంధువర్గాల నుండి వ్యతిరేకత, ఆరోగ్యంతో చికాకులు అధికమవుతాయి. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్ళు తప్పవు. తీర్థయాత్రలు, విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కుంటారు.
 
తుల :- ఆర్థిక విషయాలలో స్వల్ప ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం.
 
వృశ్చికం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తి సాగుతాయి. స్త్రీలకు నడుము, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. బంధువులరాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయనాయకులు ప్రముఖులను కలుసుకొని బహుమతులు అందజేస్తారు.
 
ధనస్సు :- ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాట గలవు. పాతబాకీలు అనుకోకుండి వసూలవుతాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ఆలయాలను సందర్శిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి.
 
మకరం :- మీ ప్రత్యర్ధులు వేసే పథకాలు ధీటుగా ఎదుర్కుంటారు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పెద్దమొత్తం ధనం, నగదుతో ప్రయాణాలు మంచిది కాదు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయ సహకారాలు అందుతాయి.
 
కుంభం :- ధనం కంటె ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. సోదరీ, సోదరులతో సంబంధాలు బలపడతాయి. ప్రత్తి, పొగాకు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
మీనం :- వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత పురోభివృద్ధి ఉండదు. మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. క్రయ, విక్రయ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం.