మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు, పాత పరిచయస్తులు తారసపడతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ముఖ్యుమైన పనులు వేగవంతమవుతాయి. ధనలాభం ఉంది. చెల్లింపులు జరుపుతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. పత్రాల రెన్యువో ఏకాగ్రత వహించండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆకస్మికలు ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. పిల్లలకు శుభం జరుగుతుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణంలో ఒకింత అవస్తలు తప్పవు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో సతమతమవుతారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతికూలతలను అధిగమిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. అప్రమత్తంగా ఉండాలి. పొగడ్తలకు పొంగిపోవద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి. వాహనదారులకు దూకుడు తగదు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. మీ సిఫార్సుతో ఒకరికి మేలు జరుగుతుంది.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు కొలిక్కివస్తాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఊహించని ఖర్చు చికాకుపరుస్తుంది. ఆత్మీయుల సాయం అందిస్తారు. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమర్థతను చాటుకుంటారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్తయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బంధుమిత్రులతో విభేదిస్తారు. పట్టింపులకు పోవద్దు. ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పిల్లల యత్నాలు ఫలించవు. సన్నిహితు వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. కష్టసమయంలో ఆప్తులు ఆదుకుంటారు. పనుల్లో ఒత్తిడి అధికం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. బంధువులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహలిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పనులు త్వరితగతిన సాగుతాయి.