1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 28-03-2026 Your Daily Horoscope

29-03-2026 ఆదివారం ఫలితాలు- రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు..

Debits
Debits
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
శుభసమయం ఆసన్నమైంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. కొంతమొత్తం ధనం అందుతుంది. ధనసహాయం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య కలహం. సన్నిహితులతో సంభాషిస్తారు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి, 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వివాహసంబంధం కుదిరే సూచనలున్నాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆకస్మిక ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. అన్యమనస్కంగా గడుపుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. జూదాలు, బెట్టింగ్‌ల జోలికిపోవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభవార్త వింటారు. యత్నం ఫలిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. రుణ సమస్య నుంచి విముక్తులవుతారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. విలాసాలకు ఖర్చుచేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ శక్తిసామర్థ్యాలపై నమ్మకం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. దుబారా ఖర్చులు విపరీతం. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు సంతృప్తికరం. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో చికాకులు అధికం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పత్రాలు అందుకుంటారు. స్థిరాస్తి అమర్చుకునే దిశగా ఆలోచిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. మీ కష్టం ఫలించదు. పట్టుదలతో శ్రమించండి. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రయాణం విరమించుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలమే. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. గృహంలో సందడిగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. వివాదాలకు దిగవద్దు. మితంగా సంభాషించండి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకున్నది సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. పొగిడేవారితో జాగ్రత్త. ఖర్చులు విపరీతం. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. చేసిన పనులే చేయవలసి వస్తుంది. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పం సిద్ధిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. అనుకోని ఖర్చు ఎదురవుతుంది. పనులు నిదానంగా సాగుతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
తర్వాతి కథనం
28-03-2026 శనివారం ఫలితాలు - మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు