గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (22:30 IST)

19-06-2022 నుంచి 25-06-2022 వరకు మీ వార రాశిఫలాలు

weekly astro
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. కొత్త పరిచయాలేర్పడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆశావహ దృక్పథంతో మెలగండి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. మంగళ, బుధవారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. సన్నిహితుల సలహా తీసుకోండి. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. హోల్‌సేల్ వ్యాపారులకు కష్టకాలం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. కోర్టువాయిదాలు చికాకుపరుస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆప్తులకు వివాహ సమాచారం అందిస్తారు. ఖర్చులు సామాన్యం. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. గృహనిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్థ, పునర్వసు 1, 2, 3 పాదములు
మీ ఉన్నతిని చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. శనివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
శుభవార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆది, సోమవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త, ఇంటి విషయాలు వెల్లడించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. గృహమార్పు కలిసివస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. బిల్డర్లు, కార్మికులకు పనులు లభిస్తాయి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ఈ వారం వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు ఒక పట్టాన పూర్తి కావు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కన్య. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరించాలి. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ప్రియతములతో గడపటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనం. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. నిరుద్యోగులకు సదావకాశం లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సోమ, మంగళవారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. ఆత్మీయులకు వివాహ సమాచారం అందిస్తారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వృత్తుల వారికి సామాన్యం. నిర్మాణాలు ముందుకు సాగవు. బిల్డర్లకు కష్టకాలం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. రిప్రజెంటేటిన్లు టార్గెట్లను అధిగమిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
వాగ్దాటితో నెట్టుకొస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపకాలు విస్తరిస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. బుధ, గురువారాల్లో పత్రాలు, వస్తువులు జాగ్రత్త. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో ఆటంకాలు తొలగుతాయి. అధికారుల మన్ననలు అందుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. ఆప్తుల సలహా పాటించండి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
పట్టుదలతో శ్రమించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదివారం నాడు ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యతిరేకులతో జాగ్రత్త. గృహమార్పు చికాకుపరుస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. బిల్డర్లకు ఒత్తిడి అధికం. వాయిదా పడుతూ వస్తున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు, 
అన్ని వర్గాల వారికి బాగుంటుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. మంగళ, బుధవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ ఆలోచనలను కొంతమంది నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మార్కెటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఓర్పుతో వ్యవహరిస్తారు. కార్యం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గికుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి పెట్టుబడులకు తరుణం కాదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి వ్యవహారంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆది, గురువారాల్లో, వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు శుభయోగం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా, దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి.