గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (21:41 IST)

01-07-2023 నుంచి 31-07-2023 వరకు మాస రాశి ఫలితాలు, ఏ రాశి ఎలా వుందంటే?

monthly horoscope
మేష రాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం ఆశాజనకం. సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ధనలాభం ఉంది. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంస్థల స్థాపనలు, నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. బంధువుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ప్రయాణం విరమించుకుంటారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు తరుణం కాదు. కొత్త పనులకు శ్రీకారంచుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
వాగ్ధాటితో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా మెలగండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో మార్పులుచేర్పులకు అనుకూలం. శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు శుభయోగం. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పెట్టుబడులు కలిసిరావు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతాన సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పనులు సానుకూలమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు మేలైన సలహాలిస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కష్టసమయంలో సహోద్యోగులు ఆడుకుంటారు. వ్యవసాయ కూలీల ఆదాయం బాగుంటుంది. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య అవగాహన లోపం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకు కష్టకాలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
అనుకూలతలు అంతగా ఉండవు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఆచితూచి వ్యవహరించాలి. ఆప్తుల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహమార్పు అనివార్యం. అయిన వారికి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఈ మాసం ఆశాజనకం. వాగ్ధాటితో రాణిస్తారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు, 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట, 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి, పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. పొదుపునకు అవకాశం లేదు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి, స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యవసాయ కూలీల ఆదాయం బాగుంటుంది. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. వ్యాపారాలు ఆశించినంత సంతృప్తినీయవు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉపాధి పథకాలు చేపడతారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఈ మాసం ప్రతికూలతలు అధికం. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
సత్కాలం సమీపించింది. ఆలోచనలను క్రియారూపంలో పెట్టండి. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో జరుగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. పనులు సానుకూలతకు మరింతగా శ్రమించాలి. వివాహయత్నం ఫలిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ చొరవతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
ఇతరుల మేలుకోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆపన్నులకు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెళకువ వహించండి, నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు.