సోమవారం, 18 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (22:16 IST)

01-07-2022 నుంచి 31-07-2022 వరకు ఫలితాలు మీ మాస ఫలితాలు

astro
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్టికస్థితి సామాన్యం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. రుణ సమస్యలు వేధిస్తాయి. ఆత్మ స్థైర్యంతో వ్యవహరించండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. దంపతుల మధ్య అరమరికలు తగవు ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. పత్రాలు అందుకుంటారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటి వారి ఆంతర్యం అవగతమవుతుంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాలు చేపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ కార్యంలో పాల్గొంటారు. 4,9,10 11, 13, 16, 18, 20, 23, 24, 26 తేదీలలో పురోభివృద్ధి, 5, 7, 8, 12, 15, 17, 21, 22 25, 28, 29, 30 తేదీలలో అశాంతి. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
గ్రహాల అనుకూలత ఉంది. వాగ్దాటితో నెట్టుకొస్తాడు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పత్రాలు అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతాడు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. 1, 2, 4, 3, 10, 11, 13, 16, 18, 20, 23, 24, 26 తేదీలు కలిసివస్తాయి. 8, 12, 15, 17, 21, 22, 25, 27, 28, 29, 30 తేదీలలో అసంతృప్తి. 
 
మిథునరాశి :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. వృత్తుల వారికి సామాన్యం.. కార్మికులకు పనులు లభిస్తాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 1, 2, 4, 10, 11, 13, 18, 20, 23, 24, 26, 31తేదీలలో పురోభివృద్ధి. 3, 5, 7, 8, 12, 15, 17, 21, 22, 25, 28, 29, 30 తేదీలలో నిరుత్సా హం . 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. ఆప్తుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ధార్మిక, యోగాలపై ఆసక్తి పెంపొందుతుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. గృహమార్పు అనివార్యం. పాత పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరవుతారు. 19. 10, 11, 13, 16, 18, 20, 23, 24 తేదీలు కలిసిరాగలవు. 3, 5, 7, 8, 12, 15, 17, 21, 22, 25, 28, 29, 30 తేదీలు నిరాశాజనకం. 
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ మాసం ప్రథమార్థం అనుకూలదాయకం. కష్టం ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కలుపుగోలుగా వ్యవహరిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ద్వితీయార్ధంలో అనుకూలతలు అంతగా ఉండవు. ఆశించిన పదవులు దక్కవు. ప్రత్యర్థులతో జాగ్రత్త. సంతానం విదేశీ చదువులపై దృష్టి పెడతారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 2, 4, 2, 10, 11, 13, 16, 18, 20, 23, 24, 31 తేదీలలో అభివృద్ధి. 7, 8, 12 15, 17, 21, 22, 25, 28, 29, 30 తేదీలలో అప్రమత్తంగా ఉండాలి. 
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆత్మీయుల సాయంతో ఒక అవసరం తీరుతుంది. మానసికంగా కుదుటపడతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సామాజిక, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 1,10,11,13,16,18,20, 23, 24, 26 తేదీలు ఆశాజనకం. 3, 5, 7, 8, 12, 15, 17, 21, 22 25, 28, 29, 30 తేదీలు అసంతృప్తికరం. 
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఈ మాసం అన్ని రంగాల వారికి యోగదాయకమే. ధైర్యంగా వ్యవహరిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పెట్టుబడులకు తరుణం కాదు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. 2, 4, 9, 10, 11, 13, 16, 18, 20, 23, 24, 26, 31 తేదీలలో అభివృద్ధి. 7, 8, 12, 15, 17, 21, 22, 25, 28 తేదీలలో జాగ్రత్త. 
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచింపవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సంతానం విషయంలో మేలు జరుగుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు ఉత్సాహాన్నిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 1, 2, 4, 9, 10, 11, 13, 16, 18, 20, 23, 24 తేదీలలో అభివృద్ధి. 3, 5, 7, 8, 12, 15, 17, 21, 22, 25, 28, 29, 30 తేదీలలో అప్రమత్తంగా ఉండాలి. 
 
ధనుస్సు రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
లక్ష్యం సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సంబంధాలు బలపడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. కొత్త యత్నాలకు స్వీకారం చుడతారు. గుట్టుగా వ్యవహరించండి. గృహంలో సందడి నెలకొంటుంది. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త బాధ్యతలు అప్పగించవద్దు. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫూరిస్తాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. 2, 4, 9, 10, 11, 13, 16, 18, 20, 23, 24, 26 తేదీలు అనుకూలం . 5, 8, 12, 14, 15, 17, 21, 22, 30 తేదీలు ప్రతికూలతలు 
 
మకరం : ఉత్తరాషాడ 23, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఈ మాసం నిరాశాజనకం. అదితూచి వ్యవహరించాలి. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. విమర్శలు పట్టించుకోవచ్చు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొడుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. దంపతులు మధ్య సఖ్యత లోపం. వీటికి మాటికి అసహనం చెందుతారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. కార్మికులకు పనులు లభిస్తాయి. పందాలు, జూదాలకు దూరంగా ఉండండి. 12,11,13,16,18,20, 23, 24, 31 తేదీలు కలిసిరాగలవు. 3, 8, 12, 15, 17, 21, 22, 25, 26 తేదీలు నిరాశాజనకం.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. ప్రత్యేక గుర్తింపు పొందుతారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం ధోరణి విసుగు కలిగిస్తుంది. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పెట్టుబడులకు అనుకూలం. నూతన వ్యాపారాలు చేపడతారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 2, 4, 9, 10, 11, 13, 16, 18, 20, 23, 24, 26, 31 తేదీలలో అభివృద్ధి, 7, 8, 12, 15, 17, 21, 22, 25, 28, 29 తేదీలలో శ్రమ అధికం. 
 
మీనరాశి: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. ఆశావహదృక్పథంతో మెలగండి. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 1. 4, 10, 11, 13, 16, 18, 20, 23, 31 తేదీలు కలిసిరాగలవు. 5, 7 ,8, 12, 15, 17, 21, 22, 25, 28, 30 తేదీల్లో నిరుత్సాహం తప్పదు. `