మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2023 (20:15 IST)

01-01-2024 నుంచి 31-01-2024 వరకు ఫలితాలు మీ మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వేడుకలను ఘనంగా చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువుల జాగ్రత్త. వ్యవహారాలను మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. అనుకూలతలు అంతంతమాత్రమే. లావాదేవీలతో తీరిక ఉండదు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం. అయిన వారి కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆచితూచి అడుగేయాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. చిరువ్యాపారులకు బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు. వేడుకకు హాజరవుతారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టు విడుపు ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం గ్రహిస్తారు. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. అసాధ్యమనుకున్న పనులు తేలిగా పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. సమర్థతను చాటుకుంటారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంప్రదింపులకు అనుకూలం. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. ఎవరినీ నొప్పించవద్దు. మీ కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో ఏకాగ్రత వహించండి. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగ బాధ్యతల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం అనుకూలంగా ఉంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. మొండి బాకీలు వసూలవుతాయి, విలాసాలకు వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని కట్టడి చేయండి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. చెల్లింపుల్లో మెళకువ వహించండి. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. అవివాహితులకు శుభయోగం. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. సేవ, దైవకార్యాలకు సాయం అందిస్తారు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త వ్యక్తులను నమ్మవద్దు. కుటుంబీకుల గురించి ఆందోళన చెందుతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆహ్వానం అందుకుంటారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. క్రీడాపోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం యోగదాయకమే. ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పరిచయాలు బలపడతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. పత్రాలు అందుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిన్న వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభాపాఠవాలు వెలుగుచూస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత ప్రధానం. పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పురస్కారయోగం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. మధ్యవర్తులను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడుతు వస్తున్న మొక్కులు తీర్చుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో స్పర్ధలు తలెత్తుతాయి. సామరస్యంగా మెలగండి. ఎవరినీ కించపరచవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాలు జాగ్రత్త. వ్యాపారాలు ఏమంత సంతృప్తినీయవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పందాలు, జూదాలకు పాల్పడవద్దు.
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. అందరితో కలుపుగోలుగా మెలుగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. పనులు సానుకూలమవుతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. అయిన వారిని విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. వస్త్ర, బంగారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త వ్యాపారాలకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులను మెప్పిస్తారు. ఉద్యోగయత్నంలో మెలకువ వహించండి. మధ్యవర్తులను నమ్మవద్దు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. సర్వత్రా అనుకూలతలుంటాయి. అనుకున్నది సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనివార్యం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.