గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (10:01 IST)

01-12- 2023 నుంచి 31-12-2023 వరకు డిసెంబరు మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థికస్థితి ఆశాజనకం. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ అంచనాలు ఫలిస్తాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పెట్టుబడులు, పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతులకు ఆరోగ్యభంగం. వైద్యసేవలు అవసరమవుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. ప్రయాణం తలపెడతారు. 
 
వృషభ రాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. గుట్టుగా యత్నాలు సాగించండి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలు ఎదురవుతాయి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
మిథున రాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతో శ్రమిస్తేనే ఆశించిన ఫలితాలు పొందగలరు. ఎవరి సాయం ఆశించవద్దు. స్వయంకృషినే నమ్ముకోండి. ప్రతిభాపాటవాలు నిదానంగా వెలుగులోకి వస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో రాణిస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. వ్యవహరాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. అంతరంగి విషయాలు గోప్యంగా ఉంచండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. సంతానం దూకుడు అదుపుచేయండి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంకల్పం సిద్ధిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అయన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఖర్చులు భారమనిపించవు. వాయిదా పడుతున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శుభసమయం ఆసన్నమైంది. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా మంచికేనని భావించండి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. దాంపతసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై పెట్టండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆహ్వానం, కీలక పత్రాలు, అందుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. తీర్థయాత్రలు, విదేశాల సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. ఆప్తుల రాకపోకలు అధికమవుతాయి. గృహం ఉంటుంది. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. మీ ప్రమేయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. మీ పథకాలు ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులకు ఓర్పు, కృషి ప్రధానం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రలోభాలకు లొంగవద్దు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికీ శుభదాయకమే. యత్నాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆత్మీయులు సాయం అందిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాదనలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. 
 
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఒంటెద్దు పోకడ తగదు. పెద్దల సలహా తీసుకోండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. శుభకార్యంపై దృష్టి పెడతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. గృహ అలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. వ్యవసాయ కార్మికులకు ఒత్తిడి, పనిభారం. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
 
మకర రాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. దంపతుల మధ్య అకారణ కలహం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆప్తుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ఓర్పుతో ఉద్యోగయత్నాలు సాగించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. గృహాలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సత్కాలం సమీపిస్తోంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సహాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు పట్టుదలను రేకెత్తిసాయి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా మంచికేనని భావించండి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు త్వరలో ఆశించిన ఫలితాలిస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగసులకు శుభదాయకం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.