మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (20:39 IST)

శరదృతువు- పౌర్ణమి రాత్రి చంద్రగ్రహణం.. గజకేసరి యోగం..!

Astrology
శరదృతువు పౌర్ణమి రాత్రి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కొన్ని దశాబ్దాల తర్వాత, శరద్ పూర్ణిమ రాత్రి చంద్రగ్రహణం సంభవిస్తోంది. అలాగే, చంద్రుడు మేషరాశిలో ఉంటాడు, అక్కడ బృహస్పతి ఇప్పటికే ఉన్నాడు. 
 
ఇలా మేషరాశిలో చంద్రుడు, బృహస్పతి కలయిక గజకేసరి రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం పవిత్రమైంది. ఈ యోగం ద్వారా వృషభ రాశి, మిథునం, కన్యారాశి, కుంభ రాశికి సానుకూల ఫలితాలు వుంటాయి. 
 
ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. చంద్రగ్రహణం రోజున అదృష్టం కలుగుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. 
 
ఈ చంద్రగ్రహణం మంచి సమయాలను తెస్తుంది. కానీ ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఉన్నత పదవి లభిస్తుంది. జీతం పెరుగుతుంది. 
 
చంద్రగ్రహణం సమయంలో ఆహారం తినకూడదు. కుట్టుపని, అల్లికలు చేయరాదు. ఈ సమయంలో పూజ చేయకూడదు. ఇంట్లో కూర్చొని భగవంతుని మంత్రాన్ని జపించవచ్చు.